ఇద్దరు హీరోలు. ఒకరు ఓ అనుకోని హిట్ ఇచ్చి ఫ్లాపుల బారి నుంచి బయట పడిన వారు. మరొకరు వరుస ఫ్లాపులతో బాధపడుతూ హిట్ ఇవ్వాలని చూస్తున్నవారు. ఇప్పుడు ఈ ఇద్దరూ దర్శకుడు త్రివిక్రమ్ చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్నారు.
ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అన్నది తెలియదు. ఆ విషయంలో అస్సలు క్లారిటీ లేదు. మరో సినిమా చేయాలని త్రివిక్రమ్ కో, నిర్మాతకో వుంటే సరిపోదు. ఎన్టీఆర్ సై అనాలి. అది జరిగే పని కాదు.
కానీ ఈలోగా తమతో ఓ సినిమా చేసేయాలని ఇద్దరు హీరోలు తెగ బతిమాలుతున్నట్లు బోగట్టా. కానీ ఇక్కడ ఆ ఇద్దరు హీరోలు మిస్ అవుతున్న లాజిక్ ఒకటి వుంది.
అంతగా వేరే సినిమా చేయడానికి త్రివిక్రమ్ సై అంటే వెళ్లి మహేష్ బాబుతో సినిమా చేయాలనుకుంటారు కానీ, మహేష్ మార్కెట్ లో సగం మార్కెట్ లేని హీరోలతో ఎందుకు చేయాలనుకుంటారు.
అందుకే త్రివిక్రమ్ వీళ్లు వస్తే స్వాదరంగా ఆహ్వానిస్తున్నారు. మాట్లాడుతున్నారు. పంపిస్తున్నారు. ప్రస్తుతానికి అంతే.