సూపర్ స్టార్ రజనీకాంత్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును అకాశానికి ఎత్తిన నేపథ్యంలో వైసీపీ-టీడీపీ నేతల విమర్శలతో సాగుతున్న రాజకీయం లోకి దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎంటర్ అయ్యారు. రజినీకాంత్ పై వైసీపీ నేతల కామెంట్లను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఖండించడంపై ఆర్జీవి కౌంటర్ వేశారు.
వైసీపీ నేతలు కేవలం రజినీపై కామెంట్లు మాత్రమే చేశారని.. కానీ మీరు లెజెండరీ ఎన్టీఆర్ ను హింసించి చంపిన సంగతి ఏంటి అని చంద్రబాబును ట్వీట్టర్ వేదికగా ప్రశ్నించారు. అలాగే మరోక ట్వీట్ లో చంద్రబాబు ఎన్టీఆర్ కు అల్లుడైనప్పటికీ ఆయనను చంపారని కౌంటర్ వేశారు.
కాగా, ఇటీవల జరిగిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన సూపర్ స్టార్ రజనీకాంత్.. ఎన్టీఆర్ కంటే టీడీపీ అధినేత చంద్రబాబుపై ప్రశంసల జల్లు కురిపించారు. ఆయన్ను జాతీయ, అంతర్జాతీయ నేత అంటూ ఆకాశానికెత్తేశారు. చంద్రబాబు గొప్పతనం గురించి ఏపీలో ఉన్న వారి కంటే బయట ఉన్న వారే ఎక్కువగా తెలుసంటూ వ్యాఖ్యానించారు. దీంతో వైసీపీ నేతలంతా రజనీపై ఎదురుదాడికి దిగారు.
నిజాయితీ, చిత్తశుద్ధి గల వ్యక్తి రజనీకాంత్ అని ఆయనను వైసీపీ నేతలు విమర్శించడం దారుణం అని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.