కలర్ ఫుల్ గా…మీదకు దూకిన మెరుపులు

సూపర్ స్టార్ మహేష్ బాబు కలర్ గురించి కానీ గ్లామర్ గురించి కానీ కొత్తగా చెప్పక్కరలేదు. కానీ రాబోయే సర్కారు వారి పాట సినిమాలో మరింతగా కనిపిస్తున్నాడు. ఈ సినిమా నుంచి వాలంటైన్స్ రోజున…

సూపర్ స్టార్ మహేష్ బాబు కలర్ గురించి కానీ గ్లామర్ గురించి కానీ కొత్తగా చెప్పక్కరలేదు. కానీ రాబోయే సర్కారు వారి పాట సినిమాలో మరింతగా కనిపిస్తున్నాడు. ఈ సినిమా నుంచి వాలంటైన్స్ రోజున విడుదల చేయబోయే పాట ప్రోమో ను విడుదల చేసారు. 

చాలా క్లాస్ టచ్ తో కలర్ ఫుల్ గా స్మూత్ మెలోడీగా వుండబోతోందీ పాట అన్న ఫీల్ ను కలిగించిందీ ప్రొమో. ప్రశాంతంగా మనసుకు హాయి కలిగించే కలర్ స్కీమ్ ను పాటకు థీమ్ గా తీసుకున్నట్లు కనిపిస్తోంది. 

మహేష్-కీర్తి చాలా అందంగా కనిపిస్తున్నారు. లక్ష మెరుపులు మీదకు దూకినట్లు అన్న లైన్ ప్రోమోలో వినిపించారు. అది అస్సలు అతిశయోక్తి కాదు అన్నట్లుగా వుంది పిక్చరైజేషన్.

గీతగోవిందం సినిమాలో కూడా దర్శకుడు పరశురామ్ క్లాస్ గీతాలు చేయించుకుని, బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. చాలా గ్యాప్ తరువాత థమన్ సంగీతం అందిస్తున్నారు మహేష్ సినిమాకు. అందువల్ల పాటల మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు ఫ్యాన్స్. ఆ అంచనాలు నిలబెట్టుకునేలాగే వుంది ప్రోమో.