తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలి

ఉమ్మడి ఏపీ రెండుగా విడిపోయినా రెండు చోట్లా ఉన్న తెలుగు వారు ప్రశాంతంగా, హాయిగా సుఖంగా ఉండాలని కోరుకుంటున్నట్లుగా విశాఖ శారదాపీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వామి ఆకాంక్షించారు. లోక కళ్యాణార్ధం పీఠంలో రాజశ్యామల యాగం…

ఉమ్మడి ఏపీ రెండుగా విడిపోయినా రెండు చోట్లా ఉన్న తెలుగు వారు ప్రశాంతంగా, హాయిగా సుఖంగా ఉండాలని కోరుకుంటున్నట్లుగా విశాఖ శారదాపీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వామి ఆకాంక్షించారు. లోక కళ్యాణార్ధం పీఠంలో రాజశ్యామల యాగం నిర్వహించినట్లుగా ఆయన తెలిపారు.

శారదాపీఠంలో వార్షికోత్సవాలు ఘనంగా ముగిసిన సందర్భంగా స్వామి అనుగ్రహభాషణ చేస్తూ ఉజ్వలమైన భవిష్యత్తు తెలుగు వారికి ఉంటుందని పేర్కొన్నారు. ఏపీకి అన్ని విధాలుగా మేలు జరగాలని కూడా పూజలు చేసినట్లుగా పేర్కొన్నారు.

కాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజశ్యామల హోమంలో పాలుపంచుకోవడమే కాకుండా ఎన్నడూ లేని విధంగా నాలుగు గంటల పాటు పీఠంలో ఈసారి గడిపారు. అదే విధంగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏపీకి ఉన్న కష్టాలు అన్నీ తొలగిపోవాలని, మంచి రోజులు రావాలని వైసీపీ నేతలు ఈ సందర్భంగా పూజలు చేశారు.

కాగా వార్షికోత్సవాలు ఘనంగా ముగియడం, గతం కంటే కూడా ఈసారి భారీ ఎత్తున సాగడం కూడా విశేష పరిణామం. మరి విశాఖ రాజధాని కోరిక వచ్చే వార్షికోత్సవాలకు సాకారం అయి తీరుతుందని వైసీపీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.