పాన్ ఇండియా హీరోయిన్..నా డ్రీమ్ – ఆలియాభట్ తో ఇంటర్వ్యూ

ఆలియా భట్..బాలీవుడ్ లో టాప్ హీరోయిన్. తెలుగు సినిమా అభిమానులు కూడా క్రేజ్ గా ఫీలయ్యే హీరోయిన్. తెలుగులో రామ్ చరణ్ సరసన, ఎన్టీఆర్ సరసన నటిస్తున్న ఈ హీరోయిన్ లేటెస్ట్ గా బాలీవుడ్…

ఆలియా భట్..బాలీవుడ్ లో టాప్ హీరోయిన్. తెలుగు సినిమా అభిమానులు కూడా క్రేజ్ గా ఫీలయ్యే హీరోయిన్. తెలుగులో రామ్ చరణ్ సరసన, ఎన్టీఆర్ సరసన నటిస్తున్న ఈ హీరోయిన్ లేటెస్ట్ గా బాలీవుడ్ లో గంగూభాయ్ కథియావాడీ అనే హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆలియా ‘గ్రేట్ ఆంధ్ర’తో ముంబాయి లో మాట్లాడారు. ఆ వివరాలు.

గంగూభాయ్ పాత్ర చేయడానికి మిమ్మల్ని ముందుకు నడిపించిన సంగతులు

వాస్తవానికి సంజ‌య్ లీలా భన్సాలీ ఈ పాత్రను నాకు ఆఫర్ చేసినపుడు నేను చాలా భయపడ్డాను. నేను. ఈపాత్రను చేయగలనా? అన్న అనుమానం. నిజానికి నేను సంజ‌య్ సినిమా బ్లాక్ కు అడిషన్స్ కు వెళ్లాను ఒకప్పుడు. కానీ ఎంపిక కాలేదనుకోండి. అప్పుడు నా వయస్సు 9 ఏళ్లు. అప్పటికి నా వయసు చాలా తక్కువ. నన్ను చూసి సంజ‌య్ ఇది హీరోయిన్ క్యారెక్టర్ అన్నారు నవ్వుతూ. అదే గుర్తుకు వచ్చింది అప్పుడు. నా భయాన్ని సంజ‌య్ తో షేర్ చేసుకున్నా. దానికి ఆయన ఒకటే అన్నారు. నాకు వదిలేయ్. నువ్వేం చేయాలో, ఎలా చేయాలో, అన్నీ తాను చూసుకుంటా అన్నారు. అప్పుడే డిసైడ్ అయ్యాను. డైరక్టర్ ఏం చేయమంటే అది చేయాలి. ఏది వద్దంటే అది మానేయాలి అని. ఈ సినిమా చెేయడానికి నా ప్రిపరేషన్ అదే.

ఈ సినిమా కోసం కాస్త బరువు పెరిగారా?

యాక్ట్యువల్లీ..కొంత అవసరం పడింది. ఆఫ్ కోర్స్ నాకు 30 ఏళ్లు అయినా నేను కొంచెం లీన్ గా వుంటాను. పైగా నా గొంతు చాలా సన్నగా వుంంటుంది. వాయిస్ లో కాస్త బేస్ కావాలి. ఈ రెండూ అధిగమించడానికి కొంత ప్రయత్నం చేసాను. అలాగే గుజ‌రాతీ స్టయిల్ మాడ్యులేషన్ కూడా కొంత ప్రాక్టీస్ చేసాను. మరీ బరువు పెరగలేదు కానీ కాస్త మంచి ఫుడ్ తిన్నాను. డైరక్టర్ ఒకటే చెప్పారు. శుభ్రంగా తిను.. సంతోషంగా వుండు అన్నాను. నాది కూడా అదే తరహా. ఇది తినకూడదు. అది తగ్గించాలి అనే టైపు కాదు.

ఏ పాత్ర చేయడానికైనా మీ ప్రిపరేషన్ ఎలా వుంటుంది

ఒక్కటే..డైరక్టర్ చెప్పింది. చేయమన్నది చేయాలి. వద్దన్నది మానేయాలి. అలాగే పాత్రను చేస్తున్నపుడు చిన్న చిన్న ఇంప్రూవైజేషన్లు..అంతే.

గంగూభాయ్ మీద వచ్చిన బుక్ చదివారా

యా..చదవాను.

ఈ పాత్రను చేయడానికి మిమ్మల్ని ఎలా ఒప్పించారు.

నన్నెవరు ఒప్పించలేదు. సంజ‌య్ లీలా భన్సాలీతో చేయడం అన్నది నా డ్రీమ్. ఆయన సినిమాలో చిన్న పాత్ర ఇచ్చినా నేను చేస్తాను. ఆయన సినిమాలో నాకూ భాగస్వామ్యం వుండాలి. అంతే. ఆయనతో పని చేయడం అన్నది వన్స్ ఇన్ లైఫ్ టైమ్ అచ్యూవ్ మెంట్. ఈ సినిమా పొడవునా నేను చాలా నేర్చుకున్నాను.

ఈ సినిమాలో మీరు ఎదుర్కొన్న క్లిష్టమైన విషయం.

ఈ సినిమా..ఈ క్యారెక్టర్ నే క్లిష్టమైన విషయాలు. ఎందుకంటే అస్సలు మనకు పరిచయం లేని ప్రపంచం అది. పైగా గుఙరాత్ లో ఏనాటిదో కథ. నేను తొలిసారి కథియావాడీ సెట్ లోకి అడుగుపెట్టాకే తెలిసింది. ఇలా వుంటుదీ అని. అక్కడ నుంచి మెలమెల్లగా ఆ పాత్రలోకి మారడం మొదలుపెట్టాను. ఒక దశలో ఇంటికి వెళ్లాక కూడా గంగూ భాయ్ పాత్ర నన్ను వెంటాడేది. ఇంట్లో వాళ్లు..నువ్వు గంగూ కాదు..ఆలియా అంటూ గుర్తు చేసేవారు. ఆ వాయిస్ లో బేస్, బాడీ లాంగ్వేఙ్ అలా వెంటాడేవి.

ఈ పాత్ర కోసం ఎలాంటి శిక్షణ తీసుకున్నారు

నాకు డైలాగ్ మాడ్యులేషన్ కోసం కోచ్ వున్నారు. ఇక మిగిలినవన్నీ సంజ‌య్ సార్ నే. నన్ను పూర్తిగా గంగూభాయ్ గా మార్చింది ఆయనే. ఒక్కోసారి పది టేక్ లు చేసినా ఓకే అయ్యేది కాదు. ఒక్కోసారి ఒక్క టేక్ లోనే సీన్ ఓకె అయ్యేది.

ఈ సినిమాలో మీ కళ్లతో చాలా బలమైన, బరువైన భావాలు పలికించినట్లు కనిపిస్తోంది. బాడీలాంగ్వేజ్ ఎలా వున్నా, సీన్ ఏదయినా కళ్లలో ఏదో పెయిన్, బాధ యూనిఫారమ్ గా ఒకే విధంగా కనిపించేలా చేసారు. ఇదంతా ఆలా సాధ్యమైంది.

అంతా సంజ‌య్ సార్ తో విపరీతంగా చర్చించడం ద్వారానే. గంగూభాయ్ పాత్రను అలా మలిచిన క్రెడిట్ అంతా ఆయనదే. కళ్లు మాత్రమే కాదు, బాడీ లాంగ్వేజ్, ఆఖరికి చేతులు, తల కదలడం ఇవన్నీ ఆయన ఆలోచనల్లోంచి వచ్చినవే.

పాండమిక్ సిట్యువేషన్ తరువాత ఓ భారీ విడుదల..ఎలా వుంది.

కాస్త టెన్షన్ వుంది. కానీ ఈ మధ్యనే పుష్ప, ఇంకా ఒకటి రెండు సినిమాలు ఆడియన్స్ ను థియేటర్ కు రప్పించాయి. అందువల్ల ధైర్యంగానే వుంది.

గంగూభాయ్ కథ మిగిలిన భాషల వారికి కూడా కనెక్ట్ అవుతుందా?

తప్పకుండా. ఇది స్టోరీ ఆఫ్ ఎ ఫైటర్.  మేబీ ఓ బ్యాడ్ వరల్డ్ నుంచి వచ్చినా, బాధ, ఎమోషన్, పోరాటం అన్నీ వున్నాయి. ఇవి ఎవ్వరికైనా కనెక్ట్ అయ్యేవే.

అజ‌య్ దేవ్ గన్ తో నటించడం ఎలా వుంది.

అద్భుతంగా వుంది. సినిమాలో ఆయనది చాలా మంచి పాత్ర. సినిమాలో గంగూభాయ్ జీవితాన్ని మలుపు తిప్పే పాత్ర. ఆయన నుంచి ప్రొఫెషనలిజం కూడా నేర్చుకున్నాను. షాట్ కు షాట్ కు మథ్యలో గ్యాప్ వున్నా ఆయన ఎక్కడకూ వెళ్లకుండా అక్కడే వుండేవారు. అనుకున్న దానికన్నా ముందే సెట్ కు వచ్చేసేవారు. నేను ఎప్పుడు వచ్చినా ఆయన నా కన్నా ముందే వుండేవారు.

గంగూ భాయ్ సినిమాలో ఫిక్షన్ ఎంత..వాస్తవం ఎంత. సాధారణంగా ఓ ఆదర్శవంతమైన ప్రపంచం నుంచి వచ్చిన పాత్రలతో బయోపిక్ నిర్మిస్తారు. గంగూభాయ్ నేపథ్యం వేరు కదా

అక్కడక్కడ కొద్దిగా సినిమాటిక్ ఫిక్షన్ వుంటుంది తప్ప పూర్తిగా కాదు. ఇక్కడ బయోపిక్ కు దారి తీసింది గంగూ ఎక్కడి నుంచి వచ్చింది అన్నది కాదు. ఆమె ఎలాంటి పోరాటం సాగించింది అన్నది.

ఆర్ఆర్ఆర్..ఎన్టీఆర్ సినిమాల మీద ఏ మేరకు ఆసక్తిగా వున్నారు

నేను ఎప్పుడూ పాన్ ఇండియన్ యాక్ట్రెస్ కావాలనుకుంటాను. శ్రీదేవి నాకు ఆదర్శం. నటులకు భాషలు అడ్డంకి కాదు.

-విఎస్ఎన్ మూర్తి