మైత్రీ మిరాకిల్ ఎస్కేప్!

తానొకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తాడు అన్నది పెద్దల మాట. ఏజెంట్ సినిమా విషయంలో అలాగే జరిగింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల హోల్ సేల్ హక్కులను నిర్మాత అనిల్ సుంకర అమ్మేసారు.  Advertisement…

తానొకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తాడు అన్నది పెద్దల మాట. ఏజెంట్ సినిమా విషయంలో అలాగే జరిగింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల హోల్ సేల్ హక్కులను నిర్మాత అనిల్ సుంకర అమ్మేసారు. 

కొన్న వ్యక్తి అవే హక్కులను విడివిడిగా అమ్మడం మొదలుపెట్టారు. నైజాంలో మాత్రం ఎవ్వరూ కొనేందుకు ముందుకు రాలేదు. రాలేదు అనేకన్నా, రాకుండా తెరవెనుక రాజకీయాలు జరిగాయన్నది వాస్తవం. ఎందుకంటే హోల్ సేల్ గా కొనుక్కున్న బయ్యర్ కు మైత్రీ సంస్థకు బంధాలు వున్నాయి. 

చాలా ఎక్కువ రేట్ కు కొనేసారు కనుక, దాన్ని మైత్రీకి ఎక్కువ రేట్ కే ఇస్తారు. అప్పుడు సినిమా తేడా కొడితే మైత్రీ సంస్థ నష్టపోతుంది. ఇదీ ప్లాను.

నిజానికి ఇలాగే జరిగి వుండేది. కానీ మైత్రీ పంపిణీ సంస్థ భాగస్వామి శశి అదే టైమ్ లో అమెరికాలో వుండిపోయారు. 23 నాటికి వస్తారు..అని చూసారు. ఈలోగా మైత్రీ మీద ఐటి రెయిడ్ అయింది. దాంతో మొత్తం వ్యాపారాలు అన్నీ అబేయన్స్ లో పెట్టారు. దాంతో ఇక ఏజెంట్ సినిమా వ్యవహారమే పక్కకు పోయింది.

ఈ నేపథ్యంలో సినిమా హోల్ సేల్ బయ్యర్ ఎనిమిది కోట్ల రికవరబుల్ అడ్వాన్స్ కు వేరే వాళ్ల దగ్గర పెట్టారు. ఇప్పుడు ఎంత పోయినా, ఆ హోల్ సేల్ బయ్యర్ కే నష్టం. మొత్తానికి మైత్రీ సంస్థ ఎస్కేప్ అయింది. ఈ తెరవెనుక రాజకీయంలో బయ్యర్ నలిగిపోయారు. 

ఈ రాజకీయం లేకుండా వుంటే ఎవరో ఒకరు నాన్ రికవరబుల్ అడ్వాన్స్ ఇచ్చేవారు. బయ్యర్ కాస్తయినా సేఫ్ అయ్యేవారు. అలా మాత్రం జరగలేదు.