వాల్తేర్ వీరయ్య తరువాత మెగాస్టార్ చేస్తున్న సినిమా వాల్తేర్ వీరయ్య. రీమేక్ సినిమా అయినా చకచకా బండి ముందుకు నడవడం లేదు.
ఈ సినిమాకు విడుదల డేట్ ను ముందుగానే ప్రకటించేసారు. కావాల్సినంత టైమ్ వుంది. కానీ విడుదల వుంటుందా? వుండదా? అనే అనుమానాలు ముసురుకుంటున్నాయి. ఆగస్టు 11న అంటే మూడు నెలలు పైగానే సమయం వుంది. కానీ వర్క్ కూడా అదే రేంజ్ లో వుందని టాక్ వినిపిస్తోంది.
ఇంకా నలభై రోజుల వరకు పని వుందని తెలుస్తోంది. ఇక్కడ మెగాస్టార్ వైపు నుంచి ఏ లోపం లేదు. కాంబినేషన్ డేట్ లు అంత సులువుగా సెట్ కాకపోవడంతో సినిమా లేట్ అవుతోంది. ఎలాగైనా డేట్ మిస్ కాకూడదని చూస్తున్నారు. కానీ కీర్తి సురేష్ వైపు నుంచి సమస్య అవుతోందని భోగట్టా. కీర్తి వేరే భాషలో ఓ కీలకమైన సినిమా ఓకె చేసింది. దానితో ఈ సినిమాకు డేట్ లు క్లాష్ అవుతున్నాయి. దాని వల్ల భోళా లేట్ అవుతోంది.
అందువల్ల టాలీవుడ్ లో భోళా విడుదల తేదీ మీద అనుమానాలు ముసురుకుంటున్నాయి. మరోపక్కన ఆగస్టు 11 కు భోళా లేకున్నా, వచ్చేద్దామనుకునే సినిమాలు పెద్దగా లేవు. డిజె టిల్లు 2 సినిమా ఎలాగూ వస్తుంది. ఒక వేళ భోళా రాకుంటే ఆ డేట్ ను పట్టుకోవాలన్ రామ్-బోయపాటి సినిమా చూస్తోంది. మే నెల దాటితే క్లారిటీ వస్తుంది.