తప్పు చేసినోడిని అర్థరాత్రి అరెస్ట్ చేస్తే.. తప్పేంటి..?

ఎమ్మెల్సీ అశోక్ బాబు అరెస్ట్ అయ్యారు. తప్పుడు సర్టిఫికెట్లు సృష్టించి, పదోన్నతి పొంది, ఆ పదోన్నతిని అనుభవించి, రిటైర్ అయిన తర్వాత ఎమ్మెల్సీ పదవిలో ఉన్న అశోక్ బాబుని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే…

ఎమ్మెల్సీ అశోక్ బాబు అరెస్ట్ అయ్యారు. తప్పుడు సర్టిఫికెట్లు సృష్టించి, పదోన్నతి పొంది, ఆ పదోన్నతిని అనుభవించి, రిటైర్ అయిన తర్వాత ఎమ్మెల్సీ పదవిలో ఉన్న అశోక్ బాబుని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అర్థరాత్రి అరెస్ట్ అంటూ దీనిపై టీడీపీ, దాని అనూకూల మీడియా రాద్ధాంతం చేస్తోంది. అవును, అర్థరాత్రి అరెస్ట్ చేస్తే తప్పేంటి. అసలు తప్పు చేసినోడిని ఎప్పుడు అరెస్ట్ చేయాలి అనే రూల్ ఏదైనా ఉందా..? ఉంటే అది టీడీపీ నాయకులకే వర్తిస్తుందా..?

కొంతకాలంగా అశోక్ బాబు అరెస్ట్ తప్పదు అనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తప్పుడు సర్టిఫికెట్ల వ్యవహారం, సర్వీస్ రిజిస్టర్ ని ట్యాంపరింగ్ చేసిన నేరంపై .. గతంలోనే అశోక్ బాబుపై ఫిర్యాదులున్నా.. తెలివిగా వాటిని తప్పించుకున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి టైమ్ లోనే కేసులు లేకుండా చేసుకున్నారు, ఆ తర్వాత కేసులేవీ లేవంటూ అఫిడవిట్ ఇచ్చి టీడీపీ హయాంలో ఎమ్మెల్సీ అయ్యారు అశోక్ బాబు.

ఇప్పుడు మరోసారి ఆరోపణలు రావడంతో విచారణను ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. సీఐడీ కేసు రుజువయితే.. ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీ స్థానానికి కూడా ముప్పు ఉంటుంది. అయితే ఇప్పటికే గడువు తీరిపోతోంది కాబట్టి.. ఆ విషయంలో అశోక్ బాబు పెద్దగా ఫీలయ్యేది ఏమీ లేదు. కానీ ఇంత బతుకూ బతికి.. ఇప్పుడు తప్పుడు డిగ్రీ సర్టిఫికెట్ దగ్గర దొరికిపోవడమే పరువు తక్కువగా మారింది.

తప్పు చేసినవాడికి సమర్థన..

చంద్రబాబు వెంటనే రంగంలోకి దిగారు. అర్థరాత్రి అశోక్ బాబుని ఎలా అరెస్ట్ చేస్తారంటూ రచ్చ చేస్తున్నారు. దీనికి మద్దతుగా టీడీపీ అనుకూల మీడియా కూడా అర్థరాత్రి అశోక్ అరెస్ట్. 11.30 గంటలకు అదుపులోకి తీసుకున్న పోలీస్ అంటూ రచ్చ చేస్తోంది. అంతే కానీ, ఆయన ఫలానా చోట డిగ్రీ చదివాడు, ఆయన సర్టిఫికెట్ ఇదీ, ఇందులో తప్పేమీ లేదని, ఒక్క మాట కూడా చెప్పలేకపోతున్నారు.

అసలా సర్టిఫికెట్ ఉంటే కదా చూపించడానికి. చేయాల్సిన తప్పులన్నీ చేసి, ఇప్పుడు శిక్ష ఎదుర్కోవాల్సి వచ్చే సరికి రాజకీయ కక్ష సాదింపు, అర్థరాత్రి అరెస్ట్ అంటూ సింపుల్ గా తప్పించుకోవాలని చూస్తోంది టీడీపీ.