20న విశాఖకు రాష్ట్రపతి రాక‌

భారత ప్రధమ పౌరుడు రామ్ నాధ్ కోవింద్ విశాఖ రానున్నారు. ఈ నెల 21న విశాఖలో జరిగే ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూలో రామ్ నాధ్ కోవింద్ ముఖ్య అతిధిగా పాల్గొంటారు. విదేశాల నుంచి కూడా…

భారత ప్రధమ పౌరుడు రామ్ నాధ్ కోవింద్ విశాఖ రానున్నారు. ఈ నెల 21న విశాఖలో జరిగే ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూలో రామ్ నాధ్ కోవింద్ ముఖ్య అతిధిగా పాల్గొంటారు. విదేశాల నుంచి కూడా పలు నౌకలు పాలు పంచుకునే అతి పెద్ద ఈవెంట్ విశాఖ తూర్పు నావికాదళం ఆద్వర్యంలో జరగనుంది.

దీని కోసం ప్రత్యేకంగా రాష్ట్రపతి వస్తున్నారు. ఆయన ముందు రోజు అంటే ఈ నెల 20న భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానం ద్వారా విశాఖకు చేరుకుంటారు. ఆ మరుసటి రోజు ఫ్లీట్ రివ్యూలో పాల్గొంటారు. ఇక 22వ తేదీన ఆయన ప్రత్యేక విమానంలో విశాఖ నుంచి ఢిల్లీకి వెళ్తారని అధికార వర్గాలు తెలిపాయి.

ఇదిలా ఉండగా భారత రాష్ట్రపతి విశాఖలో ఒక రోజు అంతా ఉంటారు. దాంతో అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఫ్లీట్ రివ్యూకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా హాజరవుతారు అని అధికార వర్గాల సమాచారం.

ఇదిలా ఉంటే చాలా ఏళ్ల తరువాత రాష్ట్రపతి వంటి అగ్ర హోదాలో ఉన్న వారు విశాఖకు వస్తున్నారు. దాంతో విశాఖ మొత్తం అలెర్ట్ అవుతోంది. రెండు రోజుల పాటు విశాఖ భద్రతా వలయంలోకి వెళ్ళిపోనుంది. అధికారులు కూడా అదే స్థాయిలో ఉన్నత స్థాయి ప్రమాణాలతో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.