వాడు మనిషి కాదు.. ముమ్మాటికీ వాలంటీరే..!

ఈమధ్య కాలంలో ఏపీలో ఎక్కడ ఏ నేరం జరిగినా.. నిందితుడికి ఏ రాజకీయ పార్టీతో అయినా సంబంధం ఉందేమోనని ఆరా తీస్తున్నారు. వెంటనే రాజకీయ రచ్చ లేపుతున్నారు. టీడీపీ ఓ అడుగు ముందుకేసి నిందితుడు…

ఈమధ్య కాలంలో ఏపీలో ఎక్కడ ఏ నేరం జరిగినా.. నిందితుడికి ఏ రాజకీయ పార్టీతో అయినా సంబంధం ఉందేమోనని ఆరా తీస్తున్నారు. వెంటనే రాజకీయ రచ్చ లేపుతున్నారు. టీడీపీ ఓ అడుగు ముందుకేసి నిందితుడు వాలంటీరో కాదో అని ఆరా తీస్తోంది. ఒకవేళ వాలంటీర్ అయితే.. నేరుగా వైసీపీకి లింకు పెడుతూ కథనాలిస్తోంది పచ్చ మీడియా. 

తాజాగా తూర్పుగోదావరి జిల్లా కల్తీ కల్లు కేసులో.. 'వాలంటీరే కాలయముడు' అంటూ ఈనాడు శీర్షిక పెట్టింది. అసలు ఇక్కడ వాలంటీర్ అన్న హోదాయే అవసరం లేదు. కానీ ఈనాడు తన బుద్ధి చూపించుకుంది.

వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థను భ్రష్టు పట్టించేందుకు, ప్రజల్లో చులకన చేసేందుకు.. చంద్రబాబు ఇలా తన అనుకూల మీడియాతో జనాల్లో విషం ఎక్కిస్తున్నారు. వాలంటీర్లతో ఇప్పటికే ప్రభుత్వ పథకాలు పూర్తి స్థాయిలో జనాల్లో రిజిస్టర్ అయ్యాయి. 

వాలంటీర్ అంటే ప్రభుత్వ ప్రతినిధి, జగన్ కి మరో రూపం అనే బ్రాండ్ ఇమేజ్ వచ్చేసింది. పింఛన్ల పంపిణీ, రేషన్ సరకుల పంపిణీలో సహాయం, ప్రభుత్వ పథకాలకు అర్హులను ఎంపిక చేసే ప్రక్రియ.. ఇలా అన్నిట్లో వాలంటీర్లే కీలకం. అందుకే ప్రభుత్వం కూడా వారిపై ఎక్కువ నమ్మకం పెట్టుకుంది.

అయితే వాలంటీర్లలో ఒకరిద్దరు తప్పులు చేసేవారు కూడా ఉంటారు. అది సహజం. అయితే ఎక్కడ ఎవరు తప్పు చేసినా అది చేసింది వాలంటీర్ అని హైలెట్ చేయడం, మొత్తంగా వాలంటీర్ వ్యవస్థనే డీ-గ్రేడ్ చేసేలా కథనాలు ఇవ్వడం అంతకంటే పెద్ద తప్పు. ప్రస్తుతం ఎల్లో మీడియా అదే చేస్తోంది.

వాలంటీర్ వ్యవస్థని టార్గెట్ చేసేందుకు, వాలంటీర్లను కించపరిచేందుకు, వారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేందుకే ఇలాంటి కథనాలు వండి వారుస్తోంది టీడీపీ అనుకూల మీడియా. విజయవాడలో బాలిక ఆత్మహత్య కేసులో సాక్షాత్తూ టీడీపీ నాయకుడే పట్టుబడితే.. దాన్ని పూర్తిగా తొక్కిపెట్టింది టీడీపీ అనుకూల మీడియా. 

అతడ్ని పార్టీ నుంచి తొలగించారని, గతంలో బీజేపీలో ఉన్నప్పుడు వెల్లంపల్లితో కలసి ఉన్నారంటూ వక్రభాష్యాలు చెప్పింది. ఇప్పుడేమో వాలంటీర్ తప్పు చేశారంటూ వాలంటీర్ వ్యవస్థపై పడి ఏడుస్తోంది. ఈ ఏడుపు ఎంతవరకు వెళ్తుందో చూడాలి.