ఇటీవల రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సందడి చేసాయి. ఒకటి నాని హీరోగా శ్రీకాంత్ దర్శకత్వంలో వచ్చిన దసరా. రెండవది కార్తీక్ డైరక్షన్ లో సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన విరూపాక్ష. ఇప్పటికి సమ్మర్ లో సందడి చేసినవి ఈ రెండే. ఈ సినిమాలను పోల్చి చూసుకుంటే దసరా సినిమా రఫ్ అండ్ రగ్డ్ జానర్ లో తయారైన నేటివ్ సినిమా. విరూపాక్ష పూర్తి హర్రర్ థ్రిల్లర్.
దసరా సినిమా ఖర్చు 70 మేరకు. మార్కెట్ కూడా ఆ మేరకు. విరూపాక్ష సినిమా ఖర్చు 40 కోట్ల మేరకు..మార్కెట్ 45 కోట్ల మేరకు. అంటే టేబుల్ ప్రాఫిట్.
దసరా హీరో నాని రెమ్యూనిరేషన్ 20 కోట్ల మేరకు అని వార్తలు వినిపించాయి. సాయి ధరమ్ తేజ్ రెమ్యూనిరేషన్ 8 నుంచి తొమ్మిది కోట్లు.
దసరా తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులు 24 కోట్ల మేరకు విక్రయిస్తే, మారు బేరానికి 28 కోట్లకు పైగా విక్రయించారు. విరూపాక్ష 22 కోట్ల మేరకు తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులు విక్రయించారు.
దసరా తొలి రోజు ఓపెనింగ్ ఉవ్వెత్తున లేచింది. కానీ విరూపాక్ష సినిమా సగం ఆక్యుపెన్సీతోనే ప్రారంభమైంది. దసరా సినిమా తొలి మూడు రోజుల తరువాత ఆంధ్ర,సీడెడ్ ల్లో జారిపోయింది. నైజాంలో నిలబడింది. ఆంధ్రలో వైజాగ్, ఈస్ట్ బయ్యర్లు మాత్రం సేఫ్ అయ్యారు. మిగిలిన వారు కాలేదు. సీడెడ్ కాలేదు.
విరూపాక్ష సినిమా తొలిరోజు నుంచి అంతకు అంతా పైకి లేచింది. తొలివారం అయ్యేసరికి టోటల్ బయ్యర్లు దాదాపు బ్రేక్ ఈవెన్ అయిపోయారు.
ఓవర్ సీస్ లో దసరా రెండు మిలియన్లు చేస్తే, విరూపాక్ష వన్ మిలియన్ దాటింది ఇప్పటికెే.
పాన్ ఇండియా లెవెల్ లో దసరా ఒకెసారి విడుదలయింది. విరూపాక్ష రెండు వారాల గ్యాప్ లో విడుదల చేస్తున్నారు.
నిజానికి దసరా కు జరిగినంత పబ్లిసిటీ హడావుడి విరూపాక్షకు జరగలేదనే చెప్పాలి. కానీ విడుదల తరువాత విరూపాక్ష గురించి కాస్త ఎక్కువే మాట్లాడుకున్నారు.
మొత్తానికి 2023 సమ్మర్ కు రెండు సినిమాల వ్యవహారం ఇలా వుంది. ముచ్చటగా మూడో సినిమా ఏజెంట్ రేపు విడుదలవుతోంది.