అందితే జుట్టు…అంద‌క‌పోతే కాళ్లు!

చంద్ర‌బాబునాయుడు స్నేహ హ‌స్తం చాచిన‌ప్ప‌టికీ, బీజేపీ మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేదు. బాబు ప‌రిస్థితి మరీ ఇంత దిగ‌జారిందా? అనే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌రోవైపు జాతీయ చాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ప్ర‌ధాని మోదీని ఆకాశానికి ఎత్తిన‌ప్ప‌టికీ…

చంద్ర‌బాబునాయుడు స్నేహ హ‌స్తం చాచిన‌ప్ప‌టికీ, బీజేపీ మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేదు. బాబు ప‌రిస్థితి మరీ ఇంత దిగ‌జారిందా? అనే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌రోవైపు జాతీయ చాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ప్ర‌ధాని మోదీని ఆకాశానికి ఎత్తిన‌ప్ప‌టికీ చంద్ర‌బాబును బీజేపీ నేత‌లెవ‌రూ ప‌ట్టించుకోలేదు. బాబు సానుకూల వైఖ‌రిని స్వాగ‌తిస్తున్నామ‌నే ప్ర‌క‌ట‌న‌లు రాలేదు. పైగా చంద్ర‌బాబుపై బీజేపీ దారుణంగా ట్రోలింగ్ చేస్తోంది.

అందితే జుట్టు, అంద‌క‌పోతే కాళ్లు ప‌ట్టుకునే నైజం చంద్ర‌బాబుది అంటూ ఏపీ బీజేపీ నేత‌లు ట్రోలింగ్‌కు పాల్ప‌డ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. రాజ‌కీయ కార‌ణాల‌తో చాలా మెట్లు దిగి, బీజేపీతో క‌లిసిపోవాల‌నే చంద్ర‌బాబు ప్ర‌య‌త్నాలు ఏ మాత్రం స‌క్సెస్ కాలేద‌నేందుకు ఆ పార్టీ విసుర్లే నిద‌ర్శ‌నం. ఈ సంద‌ర్భంగా గ‌తంలో మోదీ, అమిత్‌షాల‌పై బాబు ఘాటు విమ‌ర్శ‌ల‌ను బీజేపీ నేత‌లు తెరపైకి తెచ్చి, మ‌రీ చాకిరేవు పెడుతున్నారు.

గ‌తంలో భార్య‌తో క‌లిసి ప్ర‌ధాని మోదీ లేర‌ని, ఆయ‌న‌కు పిల్ల‌లు లేర‌ని, కుటుంబం, సంసార బాధ్య‌త‌లు తెలియ‌వంటూ ప్ర‌ధానిపై బాబు ప‌రుషంగా మాట్లాడాన్ని బీజేపీ నేత‌లు గుర్తు చేస్తున్నారు. మోదీని గ‌ద్దె దించితేనే భార‌త‌దేశానికి మంచిరోజుల‌ని మాట్లాడిన చంద్ర‌బాబు, ఇప్పుడు రాజ‌కీయ స్వార్థంతో మ‌ళ్లీ బీజేపీకి ద‌గ్గ‌ర‌య్యేందుకు సిగ్గు విడిచి ప్ర‌శంసిస్తున్నార‌ని బీజేపీ నేత‌లు విరుచుకుప‌డుతున్నారు. 

చంద్ర‌బాబు మోస‌పూరిత పొగడ్త‌ల‌కు ప‌డిపోయే రోజులు పోయాయ‌ని బీజేపీ నేత‌లు సోష‌ల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. క‌నీసం ఒక మండ‌ల‌స్థాయి నాయ‌కుడికి ఉన్న పౌరుషం కూడా చంద్ర‌బాబులో లేవ‌ని వారు కామెంట్ చేయ‌డం గ‌మ‌నార్హం. చంద్ర‌బాబుతో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ క‌ల‌వ‌ర‌నేందుకు బీజేపీ తాజా ట్రోలింగే నిద‌ర్శ‌నం.