సామజవరగమన-అవసరం లేని అతుకు

శ్రీవిష్ణు హీరోగా తయారవుతున్న సినిమా సామజవరగమన. ఏకె సంస్థ సమర్పణలో రాజేష్ దండా నిర్మిస్తున్న ఈ సినిమాకు రామ్ అబ్బరాజు దర్శకుడు. ఈ సినిమా టీజర్ ను విడుదల చేసారు. సింగిల్ పాయింట్ మీద…

శ్రీవిష్ణు హీరోగా తయారవుతున్న సినిమా సామజవరగమన. ఏకె సంస్థ సమర్పణలో రాజేష్ దండా నిర్మిస్తున్న ఈ సినిమాకు రామ్ అబ్బరాజు దర్శకుడు. ఈ సినిమా టీజర్ ను విడుదల చేసారు. సింగిల్ పాయింట్ మీద నడించింది టీజర్.

హీరోకి ఎప్పుడో ఓసారి ప్రేమించిన అమ్మాయి రాఖీ కట్టేసింది. దాంతో హీరో అదేదో సైకిలాజికల్ ఇస్యూలా మార్చేసుకుని, తనకు ఐ లవ్ యూ అని చెప్పే ప్రతి అమ్మాయికీ రాఖీ కట్టేసే పని పెట్టుకుంటాడు. అలాంటి వాడు ఎలా మళ్లీ ప్రేమలో పడ్డాడు అన్నది పాయింట్ కావచ్చు.

వెరైటీ పాయింట్ అని అనుకోవడం వరకు బాగానే వుంది. కానీ దాన్నే ఫుల్ లెంగ్త్ లో ఎలా బోర్ కొట్టకుండా చెప్పారన్నదాన్ని బట్టి సినిమా వుంటుంది. శ్రీవిష్ణుకు ఇలాంటి పాత్రలు పెర్ ఫెక్ట్ ఫిట్ అవుతాయి. శ్రీవిష్ణు బాడీ లాంగ్వేజ్ బాగుంది. టీజర్ కట్ అంతా బాగానే వుంది. కానీ చివర్న బాలయ్య టెలిఫోన్ చాటింగ్ ను ఇమిటేట్ చేస్తూ పెట్టిన బిట్ మాత్రం కేవలం టీజర్ ను వైరల్ చేసుకోవడానికి తప్ప మరెందుకు అన్న క్వశ్చన్ వస్తుంది.

పైగా బాలయ్య చాట్ లో చిన్న బూతు పదం వుంటుంది. ఇక్కడ ఆ పదాన్ని రీప్లేస్ చేసినా, జనాలకు ఆ పదమే ధ్వనిస్తుంది. శ్రీవిష్ణుకు వున్న ఫ్యామిలీ ఇమేజ్ ను ఇది పక్కాగా దెబ్బతీస్తుంది. ఇలాంటి అతుకు వేయకపోతే మాత్రం టీజర్ కు వచ్చిన నష్టం ఏమీ లేదు.