ఓరి దేవుడా..స్కూల్ సాంగ్

వైవిధ్య‌మైన పాత్ర‌లు, చిత్రాల‌తో త‌న‌దైన గుర్తింపు సంపాదించుకుంటున్న వైవిధ్యమైన నటుడు విశ్వక్ సేన్ క‌థానాయ‌కుడిగా, మిథిలా పాల్క‌ర్, ఆశా భ‌ట్ హీరోయిన్స్‌గా న‌టిస్తోన్న న్యూ ఏజ్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘ఓరి దేవుడా’.   Advertisement అటు…

వైవిధ్య‌మైన పాత్ర‌లు, చిత్రాల‌తో త‌న‌దైన గుర్తింపు సంపాదించుకుంటున్న వైవిధ్యమైన నటుడు విశ్వక్ సేన్ క‌థానాయ‌కుడిగా, మిథిలా పాల్క‌ర్, ఆశా భ‌ట్ హీరోయిన్స్‌గా న‌టిస్తోన్న న్యూ ఏజ్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘ఓరి దేవుడా’.  

అటు చిన్న సినిమాలు ఇటు పెద్ద సినిమాలు నిర్మిస్తూ వస్తున్న పివిపి సినిమా బ్యానర్ మీద తయారవుతున్న సినిమా ఇది. తమిళ సినిమా ఓ మై కడవులే కు తెలుగు రీమేక్ ఇది. 

అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో ‘ఓరిదేవుడా’ చిత్రం తెర‌కెక్కుతోంది. నిర్మాత దిల్‌రాజు ఈ చిత్రానికి సమ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ సినిమా నుంచి ''.. ‘పాఠశాలలో పాత బడదురా…’ అనే లిరికల్ సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. చిన్ననాటి నుంచి పెద్దయ్యే వరకు ఉండే స్నేహితుల మధ్య ఉండే స్నేహం గురించి తెలియజేసేలా ఉందీ సాంగ్. 

లియోన్ జేమ్స్ సంగీతం అందించిన ఈ పాటను అనంత శ్రీరామ్ రాశారు. అర్మాన్ మాలిక్, సమీరా భరద్వాజ్ ఈ పాటను పాడారు. ఈ చిత్రానికి దర్శకుడు తరుణ్ భాస్కర్ మాటలను అందిస్తున్నారు.