ఖిలాడీ..రొమాంటిక్ యాక్షన్ మూవీ

మాస్ హీరో రవితేజ- డైరక్టర్ రమేష్ వర్మ కాంబినేషన్ లో తయారై విడుదలకు సిద్దమైన సినిమా ఖిలాడీ. ఈ సినిమా ట్రయిలర్ ను ఈ రోజు విడుదల చేసారు.  Advertisement ట్రయిలర్ లో యాక్షన్…

మాస్ హీరో రవితేజ- డైరక్టర్ రమేష్ వర్మ కాంబినేషన్ లో తయారై విడుదలకు సిద్దమైన సినిమా ఖిలాడీ. ఈ సినిమా ట్రయిలర్ ను ఈ రోజు విడుదల చేసారు. 

ట్రయిలర్ లో యాక్షన్ పార్ట్ ఎక్కువ, ఆపై రొమాన్స్ కు మరి కాస్త ప్లేస్ ఇచ్చారు. కానీ రవితేజ స్టయిల్ గా కనిపించాడు. స్టయిల్ గా ఫైట్లు చేసాడు. మాంచి రొమాన్స్ సీన్లు చేసాడు. 

ఇవన్నీ ట్రయిలర్ లో కీలకంగా కనిపించాయి. కానీ ఒక్కటే మిస్ అయింది అనిపించింది. అది రవితేజ మార్కు ఫన్. మరి సినిమాలో ఆ ఫన్ వుంటుందా లేదా అన్నది తెలియదు. ట్రయిలర్ లో చోటు చేసుకున్న యాక్షన్ సీన్లు అన్నీ క్వాలిటీగా వున్నాయి. రొమాన్స్ సీన్లు కూడా బాగానే ప్లేస్ చేసినట్లు కనిపిస్తోంది. 

సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్. కానీ ట్రయిలర్ లో ఎక్కడా ఆ ఛాయలు లేకుండా జాగ్రత్త పడ్డారు. అంటే సినిమా చూసినపుడు థ్రిల్ మిస్ కాకూడదనే ఆలోచన అయి వుంటుంది. మొత్తం మీద ఓ భారీ యాక్షన్ సినిమా ట్రయిలర్ ఎలా వుండాలో అలాగే వుంది. ఖిలాడీ.