దాదాపు ఏడాది కిందటే రెడీ అయింది. ఇప్పుడు ఫ్రెష్ గా ప్రమోషన్ స్టార్ట్ చేశారు. యూత్ ఫిలిం అనే కవరింగ్ ఇస్తున్నారు. కానీ ఇన్ సైడ్ టాక్ ఏంటంటే.. ఇదొక అడల్ట్ సినిమా అంట. ఇంకా పచ్చిగా చెప్పాలంటే బూతు సినిమాకు యూత్ కలరింగ్ ఇస్తూ తీసిన మూవీ అంట. అదే వర్జిన్ స్టోరీ. నిర్మాత లగడపాటి శ్రీధర్ తనయుడు విక్రమ్ సహిదేవ్ హీరోగా నటించిన సినిమా ఇది.
తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో హీరో తొలి అనుభవం కోసం వెంపర్లాడుతుంటాడు. ఇక హీరోయిన్ కూడా ఒక వ్యక్తిపై ఉన్న ఫ్రస్ట్రేషన్ ను వేరే వ్యక్తితో సెక్స్ చేసి తీర్చుకోవాలనుకుంటుంది. ఇలా ఈ ఇద్దరు కలుస్తారు. పేర్లు మార్చుకొని పరిచయం చేసుకుంటారు. తొలి అనుభవానికి రెడీ అవుతారు. తమ 'కలయిక' కోసం ఇద్దరూ కలిసి ఓ మంచి రూమ్ కోసం వెదకడమే ఈ సినిమా స్టోరీ అని తెలుస్తోంది.
దీన్ని రొమాంటిక్ స్టోరీ అంటున్నారు మేకర్స్. ఆల్రెడీ చూసిన టాలీవుడ్ జనాలు మాత్రం ముక్కున వేలేసుకుంటున్నారు. తన కొడుకు విక్రమ్ సహిదేవ్ కోసం లగడపాటి స్వయంగా దగ్గరుండి సెలక్ట్ చేశారట ఈ కథ. దీని కోసం ఆయన భారీ మొత్తాన్నే ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. ఇప్పుడు ప్రమోషన్ విషయంలో కూడా తగ్గేదేలే అన్నట్టుంది వ్యవహారం.
ఓ మీడియం రేంజ్ బడ్జెట్ సినిమా ప్రచారానికి ఎంత ఖర్చు పెడతారో, అంతకంటే కాస్త ఎక్కువే ఖర్చు చేస్తున్నారు ఈ సినిమాకి. ఈ నెల 18న థియేటర్లలోకి వస్తోంది వర్జిన్ స్టోరీ.