ఎన్టీఆర్ తో సినిమా సిద్ధమన్న హాలీవుడ్ డైరెక్టర్!

'గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ' దర్శకుడు జేమ్స్ గన్ ఆర్ఆర్ఆర్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ అద్భుతంగా న‌టించార‌ని.. ఆయ‌న‌తో సినిమా చేయాల‌ని ఉందంటూ…

'గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ' దర్శకుడు జేమ్స్ గన్ ఆర్ఆర్ఆర్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ అద్భుతంగా న‌టించార‌ని.. ఆయ‌న‌తో సినిమా చేయాల‌ని ఉందంటూ త‌న మ‌న‌సులోని మాట బ‌య‌ట‌పెట్టారు. ఎన్టీఆర్ కోసం త‌గిన పాత్ర‌ను సిద్ధం చేస్తాన‌న్నారు.

ఇటీవ‌ల ఓ ఇంటర్వ్యూలో ఒకవేళ ఎవరైనా భారతీయ నటులను గార్డియన్స్ ప్రపంచంలోకి తీసుకు రావాలని అనుకుంటున్నారా? అనే ప్ర‌శ్న‌కు హాలీవుడ్ డైరెక్ట‌ర్ జేమ్స్ గ‌న్ స‌మాధానం ఇస్తూ.. ఎన్టీఆర్ గోప్ప న‌టుడ‌ని.. ఆర్ఆర్ఆర్ సినిమాలో వ్యాన్ లోనుంచి పులులు, వన్య మృగాలతో ఎన్టీఆర్ దూకే సన్నివేశం త‌న‌కు బాగా న‌చ్చింద‌ని.. అందులో ఎన్టీఆర్ చాలా కూల్ యాక్టింగ్ చేశారని ప్రశంసించారు. 

ఆర్ఆర్ఆర్ సినిమాతో జూ.ఎన్టీఆర్ హాలీవుడ్, బాలీవుడ్ లోనూ మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. కాగా ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ ఇప్పుడు కొరటాల శివ డైరెక్షన్ లో సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా, విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు.