దసరా కు ఇలా చేసి వుంటే

ఇవ్వాళ రేపు సినిమా అన్నది లాటరీ అయిపోయింది. దగ్గర వుంచుకోవాలా..వదుల్చుకోవాలా అన్నది నిర్మాత తేల్చుకోలేని పరిస్థితి. వదుల్చుకుంటే బెటర్ కావచ్చు ఒక్కోసారి. ఒక్కోసారి వదుల్చుకోకుంటే కష్టం కావచ్చు. ఏదీ ఇలా అని చెప్పలేని పరిస్థితి.…

ఇవ్వాళ రేపు సినిమా అన్నది లాటరీ అయిపోయింది. దగ్గర వుంచుకోవాలా..వదుల్చుకోవాలా అన్నది నిర్మాత తేల్చుకోలేని పరిస్థితి. వదుల్చుకుంటే బెటర్ కావచ్చు ఒక్కోసారి. ఒక్కోసారి వదుల్చుకోకుంటే కష్టం కావచ్చు. ఏదీ ఇలా అని చెప్పలేని పరిస్థితి.

దసరా సినిమాను అవుట్ రేట్ అమ్మేసారు. కనీసం నాన్ రికవరబుల్ అడ్వాన్స్ కూడా కాదు. సినిమా హిట్ అయినా ఓ రూపాయి ఏ మూల నుంచి రాకుండా చేసుకున్నారు. నిర్మాత పరిస్థితి అలాంటిది లేదా అప్పటి పరిస్థితి అలాంటిది కావచ్చు.

విరూపాక్ష సినిమాను కూడా హోల్ సేల్ గా అమ్మేసారు. కానీ నాన్ రికవరబుల్ అడ్వాన్స్ మీద ఇచ్చారు. ఓవర్ సీస్ లో మినిమమ్ గ్యారంటీ పద్దతిన ఇచ్చారు. ఓవర్ సీస్ లాభాల్లో సగం నిర్మాతగే వస్తాయి. అలాగే డొమెస్టిక్ మార్కెట్ లో ఓవర్ ఫ్లోస్ వస్తాయి. నైజాం 7 కోట్లకు కాస్త అటుగా ఇచ్చారు. 10 నుంచి 15 కోట్ల మధ్యన చేస్తుందని అంచనాలు వున్నాయి. వైజాగ్ 2.80 కోట్లకు ఇచ్చారు. నాలుగు నుంచి అయిదు కోట్లు చేస్తుందని అంచనా. అంటే నిర్మాత మంచి లాభాలు కళ్ల చూసే అవకాశం వుంది.

కమింగ్ బ్యాక్ టు దసరా. ఓ విధంగా దసరా ఆంధ్ర, సీడెడ్ అలా అవుట్ రేట్ ఇచ్చేయడం మంచింది అయింది. ఎందుకుంటే వైజాగ్, ఈస్ట్ మినహా మిగిలిన చోట్ల బ్రేక్ ఈవెన్ కాలేదు. కానీ నైజాం వరకు వచ్చేసరికి అలా ఇవ్వడం మైనస్ అయింది. ఎందుకంటే నైజాం మంచి లాభాలు వచ్చాయి బయ్యర్ కు.

మొత్తం మీద సినిమా పూర్తిగా లాటరీగా మారిపోతోంది ఇప్పుడు.