దిల్-పవన్ డీల్ ఇదేనా?

నిర్మాతగా మారిన దగ్గర నుంచి దిల్ రాజుకు ఒకటే కోరిక. పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా అయినా చేయాలని. ఇన్నాళ్లకు వకీల్ సాబ్ రూపంలో అది నెరవేరబోతోంది. అయితే ఈ సినిమాకు పవన్…

నిర్మాతగా మారిన దగ్గర నుంచి దిల్ రాజుకు ఒకటే కోరిక. పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా అయినా చేయాలని. ఇన్నాళ్లకు వకీల్ సాబ్ రూపంలో అది నెరవేరబోతోంది. అయితే ఈ సినిమాకు పవన్ రెమ్యూనిరేషన్ ఎంత? అసలు వారిద్దరి మధ్య కుదిరిన డీల్ ఏమిటి? కాస్త ఆసక్తికరమే.

విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం పవన్ కు ఈ సినిమాకు గాను మొత్తంగా యాభై కోట్లు ముడతాయి. సినిమా ఫినిష్ చేసేలోగా 25 కోట్లు అందుతాయి. సినిమా మార్కెట్ స్టార్ట్ చేసిన తరువాత అందులో వచ్చే తొలి 25 కోట్లు కూడా పవన్ కే ఇవ్వాలి. అంటే మొత్తంగా 50 కోట్లు అన్నమాట.

ఇదిలా వుంటే కరోనా కారణంగా పడిన అదనపు వడ్డీలు అన్నీ కలుపుకుని ఈ సినిమాను 40 కోట్లలో ఫినిష్ చేయగలనని దిల్ రాజు నమ్మకం అంట. అంటే పవన్ రెమ్యూనిరేషన్ తో కలిపి 90 కోట్లు. కనీసంలో కనీసం యాభై కోట్లు నాన్ థియేటర్ నుంచి వస్తాయి.

అంతకు మించే రాబట్టాలని దిల్ రాజు ప్రయత్నం అంట. చాలా కాలం తరువాత పవన్ సినిమా కాబట్టి థియేటర్ నుంచి కూడా గట్టిగానే వస్తాయని ఆయన నమ్మకంగా వున్నారు. వరల్డ్ వైడ్ గా థియేటర్ నుంచి నలభై పైన ఎంత వచ్చినా అది లాభం లెక్కలోనే పడుతుంది.

పేపర్లు విసిరేసిన తమ్మినేని