రిటైర్డ్ ఉద్యోగిగా రాఘవేంద్రరావు

డైరక్షన్ కెరీర్ అయిపోయింది. దర్శకత్వ పర్యవేక్షణ ముగిసింది. టీవీ షో అయిపోయింది. నిర్మాణ రంగంలో ఎప్పుడో ప్రవేశించారు. ఇక నటన ఒక్కటే మిగిలింది. ఇప్పుడు ఆ కోరిక కూడా తీర్చేసుకుంటున్నారు దర్శకుడు రాఘవేంద్రరావు.  Advertisement…

డైరక్షన్ కెరీర్ అయిపోయింది. దర్శకత్వ పర్యవేక్షణ ముగిసింది. టీవీ షో అయిపోయింది. నిర్మాణ రంగంలో ఎప్పుడో ప్రవేశించారు. ఇక నటన ఒక్కటే మిగిలింది. ఇప్పుడు ఆ కోరిక కూడా తీర్చేసుకుంటున్నారు దర్శకుడు రాఘవేంద్రరావు. 

రచయిత నటుడు తనికెళ్ల కథ, దర్శకత్వంలో ఈ సినిమా వుంటుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అంతే కాదు మరింత ముందుకు వెళ్లి, శ్రేయ కూడా ఈ సినిమాలో ఓ గెస్ట్ రోల్ వేస్తుందని గ్యాసిప్ లు వచ్చేసాయి. 

కానీ విషయం ఏమిటంంటే ఇంకా అంత వరకు రాలేదు వ్యవహారం. స్క్రిప్ట్ దశలోనే వుంది. ఓ కాలనీ బ్యాక్ డ్రాప్ లో నడిచే కథ ఇది. సినిమాలో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిగా రాఘవేంద్రరావు, ఆయన భార్యగా యాభై ఏళ్లు పైబడిన మహిళగా రమ్యకృష్ణ కనిపిస్తారు. 

ఇద్దరు గెస్ట్ హీరొయిన్లను సినిమాకు బజ్ కోసం పెడతారు. కానీ ఎవ్వరు అన్నది ఇంకా క్లారిటీ లేదు. ఎందుకంటే స్క్రిప్ట్ పూర్తయిన తరువాత, మార్చి నుంచి సెట్ మీదకు వెళ్లే టైమ్ కు ఆ గెస్ట్ లుగా ఎవరు దొరుకుతారు అన్న దాన్ని బట్టి వుంటుంది.

సినిమాలో ఇంక పెద్దగా కీలకమైన క్యారెక్టర్లు వుండవు. కానీ కమర్షియల్ టచ్, ఫన్ మాత్రం వుండేలా చూసుకుంటున్నారు. చిత్రమేమిటంటే స్వంత బ్యానర్లు ఆర్కే, ఆర్కా వున్నా కూడా రాఘవేంద్రరావు స్వంతంగా ఈ సినిమాను నిర్మించడం లేదు. వేరే బ్యానర్ వాళ్లు ఈ చిరు సాహసం చేస్తున్నారు. 

పేపర్లు విసిరేసిన తమ్మినేని