ఏమాయచేశావె సినిమాతో కుర్రాళ్ల గుండెలు కొల్లగొట్టింది సమంత. ఆ సినిమా నుంచి సమంతను ప్రతి ఒక్కరు ఫాలో అవ్వడం మొదలయ్యారు. ఆమె ఎలా ఉంది.. పెళ్లి తర్వాత ఎలా మారింది.. ప్రస్తుతం ఏ లుక్ మెయింటైన్ చేస్తోంది లాంటి విషయాలన్నీ మనకు తెలుసు. మరి 16 ఏళ్ల వయసులో సమంత ఎలా ఉంది?
16 ఏళ్ల వయసులో సమంత ఎలా ఉందనేది టాలీవుడ్ ఆడియన్స్ ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడా స్పెషల్ మూమెంట్ ను బయటపెట్టింది సమంత. 16 ఏళ్ల వయసులో తను ఇలా ఉండేదాన్నంటూ ఓ ఫొటోను షేర్ చేసింది సమంత. షార్ట్ గౌన్ లో స్టయిలిష్ గా సోఫాపై కూర్చొని, తదేకంగా దేన్నో చూస్తున్న స్టిల్ ను సమంత షేర్ చేసింది.
సమంత ఇలా పెట్టిన వెంటనే అలా వైరల్ అయింది ఈ ఫోటో. బహుశా.. చదువుకునే రోజుల్లో మోడలింగ్ కోసం ప్రయత్నిస్తూ, సమంత ఈ ఫొటో దిగి ఉంటుంది. కాలేజ్ డేస్ లో పాకెట్ మనీ కోసం చాలా పనులు చేశానని, అందులో మోడలింగ్ కూడా ఒకటనే విషయాన్ని సమంత గతంలోనే వెల్లడించింది.
కాబట్టి, ఈ స్టిల్ చూస్తుంటే, కచ్చితంగా ఆమె మోడలింగ్ కెరీర్ స్టార్టింగ్ డేస్ లో దిగిన ఫొటోలానే అనిపిస్తోంది. చాలామంది హీరోయిన్లలా ఫొటోషూట్స్ కు మాత్రమే పరిమితం కాకుండా, తన చిన్ననాటి జ్ఞాపకాల్ని కూడా అభిమానులతో షేర్ చేస్తుంటుంది సమంత. తన పదో తరగతి మార్కుల్ని ఇప్పటికే బయటపెట్టిన ఈ బ్యూటీ, దాంతో తన చిన్నప్పటి ఫొటోలు చాలానే షేర్ చేసింది. ఇప్పుడిలా పదహారేళ్ల వయసు పిక్ తో సోషల్ మీడియాలో సునామీ సృష్టించింది.