తనకు చంద్రబాబుకు మధ్య తేడా చెప్పిన జగన్

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు “ప్రతిపక్ష నాయుడు” చంద్రబాబుకు మధ్య తేడా ఏంటనేది ప్రజలందరికీ తెలుసు. విశ్వసనీయత అనే పదానికి జగన్ బ్రాండ్ అంబాసిడర్ అయితే, అదే పదానికి పూర్తి వ్యతిరేకం బాబు అనే…

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు “ప్రతిపక్ష నాయుడు” చంద్రబాబుకు మధ్య తేడా ఏంటనేది ప్రజలందరికీ తెలుసు. విశ్వసనీయత అనే పదానికి జగన్ బ్రాండ్ అంబాసిడర్ అయితే, అదే పదానికి పూర్తి వ్యతిరేకం బాబు అనే విషయం ఏపీలో ఏ ఒక్కర్ని అడిగినా చెబుతారు. ఇప్పుడీ తేడాను స్వయంగా సీఎం జగన్ చెబితే ఎలా ఉంటుంది? ఈ అరుదైన సందర్భానికి ఏపీ అసెంబ్లీ వేదికగా మారింది.

“మా ప్రభుత్వం ఓ క్రెడిబిలిటీ మీద నడుస్తోంది. ఈరోజు జగన్ అనే వ్యక్తి క్రెడిబిలిటీ ఏ స్థాయిలో ఉందంటే, జగన్ ఓ మాట చెబితే చేస్తాడని జనం నమ్ముతున్నారు. దటీజ్ జగన్. అదే చంద్రబాబు క్రెడిబిలిటీ చూస్తే, బాబు ఓ మాట చెబితే.. ఆ మాట కచ్చితంగా చేయడనేది చంద్రబాబు క్రెడిబిలిటీ.”

ఇలా తనకు చంద్రబాబుకు మధ్య ఉన్న ప్రధానమైన తేడాను విడమర్చి చెప్పారు జగన్. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరకే మేనిఫెస్టోలో 90శాతం అమలు చేశామని.. అదే తమ విశ్వసనీయతకు ప్రతీక అన్నారు.

“మనం చేసే పనులు, నడవడిక వల్ల క్రెడిబిలిటీ వస్తుంది. 18 నెలలుగా జగన్ అనే వ్యక్తి ఓ తేదీ చెప్పి, చెప్పిన తేదీకి డబ్బులు అందని పరిస్థితి ఎప్పుడైనా వచ్చిందా అని సవాల్ చేస్తున్నాను. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరకే 90శాతం మేనిఫెస్టోను అమలు చేశాం. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామనడానికి ఇంతకుమించిన ఉదాహరణ లేదు.”

రైతులు, ఇన్సూరెన్స్ అంటూ చంద్రబాబు లేనిపోని హడావుడి చేస్తున్నారని.. ఇంతకుముందు చెప్పినట్టుగానే చెప్పిన తేదీకి అందరికీ  పరిహారం అందిస్తామని జగన్ మరోసారి స్పష్టంచేశారు.

ఇన్సూరెన్స్ డబ్బులు కట్టామా లేదా, ఎప్పుడు కడతామనేది ప్రభుత్వం చూసుకుంటుందని.. చెప్పిన తేదీకి రైతులకు పరిహారం, బీమా అందిందా లేదా అనేది మాత్రం బాబు చూడాలని సూచించారు జగన్.