మూడు ముక్కల్లో పవన్ పరువు తీసేశాడు

కేఏ పాల్ మరోసారి పొలిటికల్ సీన్ లోకి వచ్చారు. ఈసారి ఆయన పవన్ కల్యాణ్ టార్గెట్ గా విమర్శలు చేశారు. మామూలుగా కామెడీ పండించే పాల్.. ఈసారి పవన్ పై సునిశితంగా విమర్శలు చేస్తూనే,…

కేఏ పాల్ మరోసారి పొలిటికల్ సీన్ లోకి వచ్చారు. ఈసారి ఆయన పవన్ కల్యాణ్ టార్గెట్ గా విమర్శలు చేశారు. మామూలుగా కామెడీ పండించే పాల్.. ఈసారి పవన్ పై సునిశితంగా విమర్శలు చేస్తూనే, కామెడీగా సెటైర్లు వేశారు.

“2008లో ప్రజారాజ్యం పెట్టి, ఎంపీ పోస్టు తీసుకొని కాంగ్రెస్ లో విలీనం అయ్యారు. 2013లో మోదీ వెనక తిరిగి, ఆయన ఎంపీ సీటు ఇస్తారని ఆయనకు ప్రచారం చేశారు. ఆయన సీటు ఇవ్వలేదు. మోదీ సీటు ఇవ్వలేదని 2019లో మాయావతి పాదాల మీద పడ్డారు. ఇప్పుడు మళ్లీ గతంలో తిట్టిన బీజేపీతోనే చేరారు. ఇన్ని పార్టీలు మారుతుంటే ఏమైనా విలువ ఉంటుందా? ఇలా అమ్ముడుపోవడం మీ అభిమానులకు ఎంత విచారకమైన విషయమో తెలుసా?”

ఇలా పవన్ కల్యాణ్ కు సుతారంగా చురకలు అంటించారు కేఏ పాల్. పవన్ కు ఎంపీ సీటు అంటే మోజు ఎక్కువని, కేవలం ఆ ఒక్క ఎంపీ సీటు కోసమే ఇన్ని పార్టీల్ని, ఇన్ని సార్లు మారారని విమర్శించారు. బడుగు-బలహీన వర్గాల పేరిట ఇలా మోసం చేయకూడదని… ఓ పార్టీకి విధివిధానం, పాలసీ ఉండాలని.. పవన్ ఇలా చేయడం విచారకరం అన్నారు.

గత ఎన్నికల్లో పవన్ ను తనతో చేతులు కలపాల్సిందిగా ఆహ్వానించారు కేఏ పాల్. తనతో కలిసొస్తే ఆశీర్వాదం అందిస్తానని, ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించారు. కానీ పవన్ మాత్రం కేఏ పాల్ కు దూరంగా ఉన్నారు. గత ఎన్నికల్లో పవన్ చేసిన అతి పెద్ద తప్పు, తనతో చేతులు కలపకపోవడమేనని గతంలో కేఏ పాల్ వ్యాఖ్యానించారు.

జగన్ అంటే క్రెడిబిలిటీ