పసుపు-కుంకుమకు అర్థం చెప్పిన బుగ్గన

అంతర్జాతీయ స్థాయి రాజధాని అమరావతి అంటూ గ్రాఫిక్స్ చూపించిన చంద్రబాబు.. తన బినామీలకు, తన వర్గానికి చెందిన వ్యక్తులకు ఎలా భూములు పంచారో గత అసెంబ్లీలోనే బయటపెట్టారు మంత్రి బుగ్గన.  Advertisement వ్యక్తుల పేర్లు…

అంతర్జాతీయ స్థాయి రాజధాని అమరావతి అంటూ గ్రాఫిక్స్ చూపించిన చంద్రబాబు.. తన బినామీలకు, తన వర్గానికి చెందిన వ్యక్తులకు ఎలా భూములు పంచారో గత అసెంబ్లీలోనే బయటపెట్టారు మంత్రి బుగ్గన. 

వ్యక్తుల పేర్లు చదివి మరీ వాళ్ల పేరిట ఎన్ని ఎకరాలు ఉందో చెప్పారు, ఆ వ్యక్తుల వెనక ఎవ్వరు ఉన్నారో కూడా బయటపెట్టారు. ఇప్పుడు బాబుకు సంబంధించి మరో బండారాన్ని బట్టబయలు చేశారు బుగ్గన రాజేంద్రనాథ్.

“చంద్రబాబు హయాంలో బడ్జెట్ లైన్ కూడా ఉండదు. ఒక్క స్కీమ్ కు కూడా లైన్ ఉండదు. ఎన్నికలు వస్తున్నాయని విద్యుత్ రంగంలో కరెంట్ కంపెనీల నుంచి డబ్బులు తెచ్చి, దాన్ని పసుపు-కుంకుమ అని పంచేశారు. సివిల్ సప్లయ్ డిపార్ట్ మెంట్ డబ్బులు తెచ్చి మరో పథకానికి ఇచ్చేవారు. బడ్జెట్ లో కేటాయింపులే ఉండవు, బయట మాత్రం వేరే రంగం నుంచి తెచ్చి పంచేశారు.”

2 నెలల్లో ఎన్నికలు ఉన్నాయనగా చంద్రబాబుకు అన్నీ గుర్తొస్తాయని విమర్శించారు బుగ్గన. రాష్ట్రంలో ప్రజలంతా మోసం-దగా అనే పేర్లకు బదులుగా పసుపు-కుంకుమ అనే పదాలు వాడుతున్నారని.. ఆ ఘనత మొత్తం చంద్రబాబుదే అన్నారు. 

మొత్తమ్మీద అసెంబ్లీ సమావేశాలు జరిగిన ప్రతిసారి బాబు చేసిన అరాచకాలు, ఆయన 40 ఇయర్స్ ఇండస్ట్రీ అనుభవంలో డొల్లతనం బయటపడుతూనేే ఉంది. ఈ అసెంబ్లీ సమావేశాలు కూడా అందుకు వేదికగా మారాయి.

జగన్ అంటే క్రెడిబిలిటీ