గ్రేట‌ర్ ఓట‌ర్ కు ప‌ట్ట‌ని పోలింగ్!

గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో షాకింగ్ పోలింగ్ ప‌ర్సెంటేజ్ లు న‌మోద‌వుతున్నాయి. పోలింగ్ ప‌ర్సెంటేజ్ చాలా మంద‌కొడిగా న‌మోద‌వుతూ ఉండ‌టం గ‌మ‌నార్హం. మ‌ధ్యాహ్నం ఒంటి గంట స‌మ‌యానికి కూడా పోలింగ్ శాతం 20కు…

గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో షాకింగ్ పోలింగ్ ప‌ర్సెంటేజ్ లు న‌మోద‌వుతున్నాయి. పోలింగ్ ప‌ర్సెంటేజ్ చాలా మంద‌కొడిగా న‌మోద‌వుతూ ఉండ‌టం గ‌మ‌నార్హం. మ‌ధ్యాహ్నం ఒంటి గంట స‌మ‌యానికి కూడా పోలింగ్ శాతం 20కు చేర లేదు. రెండున్న‌ర స‌మ‌యంలో స్థూలంగా 30 శాతం వ‌ర‌కూ పోలింగ్ న‌మోదు అయి ఉంటుంద‌నే లెక్క‌లు వినిపిస్తున్నాయి. 

మ‌ధ్యాహ్నం మూడు గంట‌ల‌కు పోలింగ్ శాతం ముప్పై దాటుతుంద‌ని అంచ‌నా. దీంతో సాయంత్రానికి కూడా చెప్పుకోద‌గిన స్థాయిలో పోలింగ్ శాతం న‌మోదవుతుంద‌నే న‌మ్మ‌కాలు క‌నిపించ‌డం లేదు.  గ‌త ప‌ర్యాయం 45 శాతం న‌మోదైంది జీహెచ్ఎంసీ పోలింగ్. ఈ సారి ఆ స్థాయికి అయినా చేరుతుందా? అనేది ఇంకా ప్ర‌శ్నార్థ‌క‌మే.

ఉద‌యం పూట చ‌లికి చాలా మంది బ‌య‌ట‌కు రాక‌పోయి ఉండొచ్చు, సాయంత్రానికి మ‌ళ్లీ అదే వాతావ‌ర‌ణ‌మే ఏర్ప‌డుతుంది కాబ‌ట్టి.. మ‌ధ్యాహ్న‌మే ఎక్కువ శాతం పోలింగ్ న‌మోదు కావాల్సింది. పోలింగ్ శాతం ఈ సారి 45 కు మించ‌క‌పోతే ఓట‌ర్ల‌లో కొత్త చైత‌న్యం ఏమీ రాలేద‌ని అనుకోవాల్సి వ‌స్తుంది.

అయితే గ‌మ‌నించాల్సిన ముఖ్య‌మైన విష‌యం ఏమిటంటే.. ఇప్ప‌టి వ‌ర‌కూ 30 శాతం పోలింగ్ న‌మోదైంది కూడా.. ప్ర‌ధానంగా బ‌య‌టి వైపే. సిటీ మ‌ధ్య‌లో పోలింగ్ బూతులు వెల‌వెల‌బోతున్నాయ‌ని తెలుస్తోంది. కాస్త రూర‌ల్ ట‌చ్ ఉన్న బూత్ ల‌లో, బ‌స్తీల్లో మాత్ర‌మే బాగా ఓట్లు పోల్ అవుతున్నాయి. వాటిల్లో ఇప్ప‌టి వ‌ర‌కూ 50 శాతం వ‌ర‌కూ పోలింగ్ న‌మోదు కావ‌డంతో.. ఓవ‌రాల్ గా క‌నీసం 30 శాతం పోలింగ్ న‌మోదైన‌ట్టుగా ఉంది.

అదే సిటీ మ‌ధ్య‌లోకి వ‌స్తే కొన్ని కొన్ని డివిజిన్ల‌లో క‌నీసం 10 శాతం పోలింగ్ కూడా ఇంకా పూర్తి కాలేద‌ట‌. కొండాపూర్ లో 9 శాతం పోలింగ్ న‌మోదైంద‌ని తెలుస్తోంది! అదే అమీర్ పేట్ డివిజ‌న్లో మ‌ధ్యాహ్నం ఒంటి గంట‌కు న‌మోదైన పోలింగ్ శాతం ఒక‌టి లోపే అంటే ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క మాన‌దు.

నూటికి ఒక్క‌రు కూడా ఆ ఏరియాలో ఓటింగ్ కు వెళ్లిన‌ట్టుగా లేరు! సోమాజీగూడ‌లో నాలుగు శాతం లోపు, మాదాపూర్ లో 14 శాతం పోలింగ్ న‌మోదైంది. ఇవి మ‌ధ్యాహ్నం ఒంటిగంట‌ లెక్క‌లు. సాయంత్రం వ‌ర‌కూ ఈ పోలింగ్ స్టేష‌న్ల‌లో ఇంత‌కు  రెట్టింపు పోలింగ్ న‌మోదైనా.. కొన్ని చోట్ల ఐదారు శాతం పోలింగ్ కూడా న‌మోద‌య్యేలా లేదు!

సిటీ ఓట‌ర్లు గ్రేట‌ర్ ఎన్నిక‌ల‌ను ఎంత సీరియ‌స్ గా తీసుకున్నారో ఈ పోలింగ్ శాతాలు  చాటుతున్నాయి. జ‌నాల‌ది బ‌ద్ధ‌కం అని మీడియా నిందిస్తోంది కానీ, అంత‌కు మించి ఆలోచించాల్సిన విష‌యాలు చాలా ఉన్నాయి.

కరోనా భ‌యంతో జ‌నాలు షాపింగులు ఆప‌డం లేదు, ఉద‌యాన్నే పార్కుల వ‌ద్ద మీటింగులూ త‌గ్గించ‌డం లేదు, పోలింగ్ త‌క్కువ‌గా న‌మోదు కావ‌డానికి మాత్రం క‌రోనానో, బ‌ద్ధ‌క‌మో కార‌ణం కాక‌పోవ‌చ్చు. రాజ‌కీయ పార్టీల‌ తీరుపై ఇది నిరాస‌క్త‌త కూడా అనుకోవ‌చ్చేమో!

జగన్ అంటే క్రెడిబిలిటీ