మంగళవారం ‘బ్యాక్’ బోన్..పాయల్

ఆర్ఎక్స్ 100 తో సర్రున దూసుకువచ్చారు వర్మ శిష్యడు అజయ్ భూపతి. తరువాత కాస్త గ్యాప్ ఇచ్చి మహాసముద్రం లాంటి భారీ ఇంటెన్సివ్ సినిమా చేసారు కానీ ఫలితం దక్కలేదు. ఇప్పుడు తనే నిర్మాతగా…

ఆర్ఎక్స్ 100 తో సర్రున దూసుకువచ్చారు వర్మ శిష్యడు అజయ్ భూపతి. తరువాత కాస్త గ్యాప్ ఇచ్చి మహాసముద్రం లాంటి భారీ ఇంటెన్సివ్ సినిమా చేసారు కానీ ఫలితం దక్కలేదు. ఇప్పుడు తనే నిర్మాతగా మంగళవారం అనే వెరైటీ టైటిల్ లో సినిమా నిర్మిస్తున్నారు. అయిదు భాషల్లో తయారవుతోంది సినిమా.  ఆ సినిమా లో పాయల్ రాజ్ పుత్ కీలకపాత్ర చేస్తున్నట్లు ఫస్ట్ లుక్ ఇచ్చి మరీ ప్రకటించారు. ఈ ఫస్ట్ లుక్ లో పాయల్ క్రేజీగా కనిపిస్తోంది. ఆర్ఎక్స్ 100 సక్సెస్ లో పాయల్ కూ కీలక భాగస్వామ్యం వుంది. కుర్రకారును హుక్ వేసి లాగినట్లు లాగేసింది.

ఇప్పుడు మంగళవారం సినిమాకు కూడా అదే మ్యాజిక్ ను ఎక్స్ పెక్ట్ చేస్తున్నట్లు వుంది. ఈ ఫస్ట్ లుక్ చూస్తే అదే అనిపిస్తోంది. పూర్తిగా టాప్ లెస్ గా వున్న పాయల్ ను వెనుక నుంచి ఫొటొ తీసి ఫస్ట్ లుక్ గా వదిలారు.ఆ లుక్ చూస్తే… పాయల్ కళ్ళల్లో కన్నీటి పొర కనబడుతోంది. ఆమె వేలిపై సీతాకోక చిలుక ఉంది. జడలో మల్లెపూలు ఉన్నాయి. అయితే, ఒంటి మీద ఒక్క నూలుపోగు కూడా లేదు. వెనుక నుంచి ఫోటో తీశారు. ఇదొక ఎమోషనల్ అండ్ బోల్డ్ లుక్ అని చెప్పవచ్చు.

పాయల్ రాజ్‌పుత్ ఫస్ట్ లుక్ విడుదల చేసిన సందర్భంగా దర్శకుడు అజయ్ భూపతి మాట్లాడుతూ ''గ్రామీణ నేపథ్యంలో 1990వ దశకంలో సాగే కథతో తీస్తున్న చిత్రమిది. మన నేటివిటీతో కూడిన డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్. రా అండ్ రస్టిక్ గా ఉంటుంది. థియేటర్ల నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రేక్షకులకు గుర్తు ఉండేలా పాయల్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది. ఇప్పటి వరకు ఇండియాలో ఎవరూ ప్రయత్నించనటువంటి కొత్త జానర్ సినిమా. సినిమాలో 30 పాత్రలు ఉన్నాయి. ప్రతి పాత్రకూ కథలో ప్రాముఖ్యం ఉంటుంది'' అని అన్నారు.

నిర్మాతలు స్వాతి గునుపాటి, సురేష్ వర్మ .ఎం మాట్లాడుతూ ''అజయ్ భూపతి గారు దర్శకత్వం వహించిన 'ఆర్ఎక్స్ 100'లో ఇందు పాత్ర ప్రేక్షకులకు ఎలా గుర్తు ఉండిపోతుందో, ఇప్పుడీ 'మంగళవారం'లో శైలజ పాత్ర కూడా అలాగే గుర్తు ఉంటుంది. ఇప్పటికి 75 రోజులు షూటింగ్ చేశాం. ఎక్కువ శాతం నైట్ షూట్స్ ఉన్నాయి. 'కాంతార' ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు'' అని చెప్పారు.