ఖిలాడి…11న…18న?

రవితేజ‌ హీరోగా రమేష్ వర్మ డైరక్షన్ లో తయారైన సినిమా ఖిలాడీ. రవితేజ‌ కెరీర్ లోనో అత్యంత భారీ బడ్జెట్ సినిమా ఇది. 60 కోట్ల వరకు ఖర్చు చేసారు. రవితేజ‌ మార్కెట్ ను…

రవితేజ‌ హీరోగా రమేష్ వర్మ డైరక్షన్ లో తయారైన సినిమా ఖిలాడీ. రవితేజ‌ కెరీర్ లోనో అత్యంత భారీ బడ్జెట్ సినిమా ఇది. 60 కోట్ల వరకు ఖర్చు చేసారు. రవితేజ‌ మార్కెట్ ను థియేటర్..నాన్ థియేటర్ అంతా కలిపి 60 కోట్ల మేరకు పెంచారు. అది కూడా రికార్డే. అంతా బాగానే వుంది. కానీ విడుదల డేట్ వేళకు పరిస్థితులే బాగాలేవు.

ఆంధ్రలో 50శాతం ఆక్యుపెన్సీ, అలాగే సెకెండ్ షో కి అవకాశం లేదు. అందువల్ల 11న విడుదల వుంటుందా? వాయిదా పడుతుందా? అన్న అనుమానం వెంటాడుతోంది. నిర్మాతలు, దర్శకుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ 11న విడుదల చేస్తామనే అంటున్నారు. 

కానీ హీరో రవితేజ‌ మాత్రం పరిస్థితుల కోసం వెయిట్ చేస్తే మంచిదనే ఆలోచనలో వున్చారని తెలుస్తోంది. ఒక్క వారం వెనక్కు వెళ్తే కోవిడ్ నిబంధనలు మారుతాయని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అందుకోసమే ఆయన తన వర్క్ కొద్దిగా మిగిలి వుంటే కావాలని వాయిదా వేస్తున్నారని తెలుస్తోంది. ఆ విధంగా సినిమా విడుదలను ఓ వారం వెనక్కు నెట్టించాలన్నది రవితేజ‌ ఆలోచనగా తెలుస్తోంది. కానీ నిర్మాత, దర్శకుడు మాత్రం సినిమా వర్క్ సోమవారం నాటికి ఎలాగైనా పూర్తయిపోతుందని, 11 కే విడుదల చేసేయవచ్చని అంటున్నారు.

ఇదిలా వుంటే 11న విడుదల కావాల్సిన డిజె టిల్లు డేట్ 12 కు మార్చారు. కానీ ఖిలాడీ రాకపోతే మాత్రం మళ్లీ 11 కే మారుస్తారని తెలుస్తోంది.