టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. తను రాజకీయంగానే మాట్లాడాననే తప్పా.. రేవంత్ రెడ్డి పేరు ఎక్కడా ప్రస్తావించలేదని.. ధీరుడు ఎప్పుడూ కన్నీళ్లు పెట్టుకోడని సెటైర్లు వేశారు. మేము ప్రజల కోసం జైలుకు పోతే.. మీరు ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లారని.. అసలు రేవంత్‌తో తనకు పోలికేంటి అని మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీలో ఉండి సీఎం కాలేనని రేవంత్ రెడ్డి కన్నీరు కార్చాని సెటైర్ వేశారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు బీఆర్ఎస్ తో పొత్తుకు సిద్దమని ఢిల్లీలో చెబుతున్నారని.. రాహుల్ కేసులో కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ ఎక్కువ స్పందించిందన్నారు. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు జానారెడ్డి, వెంకటరెడ్డి లాంటి వాళ్లు బీఆర్ఎస్ తో పొత్తుకు సంకేతాలు ఇస్తున్నారన్నారు. ఏదైనా ఉంటే పొలిటికల్ గా చూసుకుందాం.. దమ్ముందా.. తేల్చుకుందాంరా.. నా ఇల్లు ఎవడు ముట్టడిస్తాడో రండి అంటూ ఈటల సవాల్ చేశారు.
కాగా.. మునుగోడు బైపోల్ లో కాంగ్రెస్‌కు సీఎం కేసీఆర్ రూ.25 కోట్లు ఇచ్చారని ఈటల ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. నిన్న సాయంత్రం హైదరాబాద్ భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్లి ప్రమాణం చేసి ఈటలపై తీవ్ర విమర్శలు కూరిపించారు. ఈ క్రమంలో రేవంత్ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు.