మొన్న చిరంజీవి.. ఈరోజు రవితేజ

సరిగ్గా వారం కిందట చిరంజీవి ఓ కొత్త కారు కొన్నారు. తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. డిజిటల్ సిగ్నేచర్ కోసం తనే స్వయంగా ఆర్టీఏ ఆఫీస్ కు వచ్చారు. ఇప్పుడు రవితేజ వంతు వచ్చింది.…

సరిగ్గా వారం కిందట చిరంజీవి ఓ కొత్త కారు కొన్నారు. తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. డిజిటల్ సిగ్నేచర్ కోసం తనే స్వయంగా ఆర్టీఏ ఆఫీస్ కు వచ్చారు. ఇప్పుడు రవితేజ వంతు వచ్చింది. రవితేజ కూడా ఓ కొత్త కారు కొన్నాడు. రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో సందడి చేశాడు.

దాదాపు 35 లక్షలు పెట్టి లేటెస్ట్ ఎలక్ట్రిక్ కారు కొనుగోలు చేశాడు రవితేజ. దాన్ని తన పేరు మీదే రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అంతేకాదు, ఫ్యాన్సీ నంబర్ కోసం అదనంగా మరో 17,628 రూపాయలు ఖర్చు చేశాడు. ఈ సెగ్మెంట్ లో ఈ కారు రవితేజకు బాగా నచ్చిందంట. అందుకే తన స్థాయికి ఇది తక్కువ రేటు అయినప్పటికీ, మరో ఆలోచన లేకుండా సొంతం చేసుకున్నాడు.

కొన్ని రోజుల కిందట చిరంజీవి కూడా కారు కొన్నారు. ఆయన ఏకంగా కోటి 20 లక్షలు ఖర్చు చేసి టయోటా కంపెనీకి చెందిన లేటెస్ట్ మోడల్ కారు కొనుగోలు చేశారు. తనకెంతో ఇష్టమైన నంబర్ కోసం ఇంకో 4 లక్షల 70వేలు ఖర్చు పెట్టి, ఫ్యాన్సీ నంబర్ తీసుకున్నారు.

మొన్నటివరకు రేంజ్ రోవర్ బ్రాండ్, టాలీవుడ్ హాట్ ఫేవరెట్ గా ఉండేది. ఇండస్ట్రీలో దాదాపు స్టార్స్ అందరి దగ్గర రేంజ్ రోవర్స్ ఉన్నాయి. ఓవైపు వాటిని వాడుతూనే, మరోవైపు ఇలా లేటెస్ట్ మోడల్ కార్లను కొనుగోలు చేస్తున్నారు చిరంజీవి, రవితేజ లాంటి హీరోలు.