17 రోజులు.. కోటి బీర్లు

లిక్కర్ అమ్మకాలు, బీర్ల వినియోగంలో తెలంగాణ మరోసారి తన మార్క్ చూపించింది. మండే ఎండల్లో తెలంగాణలో బీర్ వినియోగం విపరీతంగా పెరిగింది. తాజాగా ఎక్సైజ్ శాఖ విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాల్ని వెల్లడించాయి.…

లిక్కర్ అమ్మకాలు, బీర్ల వినియోగంలో తెలంగాణ మరోసారి తన మార్క్ చూపించింది. మండే ఎండల్లో తెలంగాణలో బీర్ వినియోగం విపరీతంగా పెరిగింది. తాజాగా ఎక్సైజ్ శాఖ విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాల్ని వెల్లడించాయి. వీటిలో ఇంట్రెస్టింగ్ మేటర్ ఏంటంటే.. ఏప్రిల్ 1వ తేదీ నుంచి మొన్నటి 17వ తేదీ వరకు ఒక్క హైదరాబాద్ లోనే 1.01 కోట్ల బీర్లు తాగేశారు హైదరాబాద్ వాసులు.

తెలంగాణలో కొన్ని రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. దీంతో బీర్ల అమ్మకాలు ఊపందుకున్నాయి. రెగ్యులర్ గా మద్యం తాగే వాళ్లు కూడా బీర్లు తాగడానికి ఆసక్తి చూపిస్తున్నారనే విషయం గణాంకాలు చూస్తే అర్థమౌతోంది.

గ్రేటర్ పరిథిలోని 3 జిల్లాల్లో కలిపి ఈ 17 రోజుల్లో 8,46,175 కేసుల బీర్లు అమ్మారు. ఈనెల ప్రారంభం నుంచి ప్రతి రోజూ హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో సగటున 6 లక్షల బీర్లు అమ్ముడుపోతున్నాయి.

నిజానికి ఈ పెరుగుల మార్చి నెల నుంచే మొదలైంది. ఆ నెలలో హైదరాబాద్ లో దాదాపు 2 లక్షల కేస్ లు, రంగారెడ్డిలో 5.50 లక్షల కేసులు, మేడ్చల్ లో 92వేలకు పైగా బీర్ కేసులు అమ్ముడుపోయాయి.

న్యూ ఇయర్ సందర్భంగా ఏటా తెలంగాణ ఎక్సైజ్ శాఖకు భారీగా ఆదాయం సమకూరుతుంది. అలా డిసెంబర్ చివరి వారం, జనవరి 1,2,3 తేదీల్లో భారీగా ఆదాయం ఆర్జించింది. ఆ స్థాయిలో మళ్లీ ఏప్రిల్ లో ఆదాయం వచ్చే అవకాశం ఉందంటోంది ఎక్సైజ్ శాఖ.