వైరల్ పిక్.. కొడుకుతో ఇలియానా

సెలబ్రిటీలంతా తమకు పుట్టిన కొడుకు లేదా కూతురు ఫొటోని వెంటనే బయటపెట్టడానికి ఇష్టపడరు. ఎన్నో రోజుల తర్వాత వారసుడు లేదా వారసురాలి ఫొటోను రిలీజ్ చేస్తారు. అయితే ఇలియానా మాత్రం అలాంటి పనులు పెట్టుకోలేదు.…

సెలబ్రిటీలంతా తమకు పుట్టిన కొడుకు లేదా కూతురు ఫొటోని వెంటనే బయటపెట్టడానికి ఇష్టపడరు. ఎన్నో రోజుల తర్వాత వారసుడు లేదా వారసురాలి ఫొటోను రిలీజ్ చేస్తారు. అయితే ఇలియానా మాత్రం అలాంటి పనులు పెట్టుకోలేదు. బిడ్డ పుట్టిన 4 రోజులకే వాడి ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టేసింది. పేరు కూడా చెప్పేసింది.

ఇప్పుడు మరోసారి తన కొడుకుతో దిగిన సెల్ఫీని రిలీజ్ చేసింది ఇలియానా. కొడుకు పుట్టిన రెండు నెలల తర్వాత ఆమె మళ్లీ ఈ ఫొటోతో సోషల్ మీడియాలోకి అడుగుపెట్టింది.

ఈమధ్యే తన బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేసింది ఇలియానా. అతడి పేరు మైఖేల్ డోలన్. ముందుగా బ్లర్ చేసిన ఫొటోను, ఆ తర్వాత పూర్తి ఫొటోను విడుదల చేసింది. దానికి డేట్ నైట్ అని పేరు పెట్టింది. అతడి గురించి అంతకుమించి వివరాలేం బయటపెట్టలేదు.

అతడి ద్వారానే కొడుకు కో ఫొనిక్స్ డోలన్ కు జన్మనిచ్చింది. అయితే బాయ్ ఫ్రెండ్ తో ఇలియానాకు పెళ్లయిందా లేదా అనేది సస్పెన్స్. వీళ్లిద్దరూ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారని కొందరంటారు. ఇలియానా మాత్రం దీనిపై క్లారిటీ ఇవ్వలేదు. ఆగస్ట్ 1న బిడ్డ పుట్టినట్టు మాత్రం వెల్లడించింది.

ప్రస్తుతం కొడుకు ఆలనాపాలనా చూసుకుంటూ బిజీగా ఉంది ఇలియానా. మరికొన్ని నెలలు గడిచిన తర్వాత ఆమె తిరిగి తన కెరీర్ ను కొనసాగిస్తుంది.