ఒకసారి దెబ్బ తిన్నాక, మరోసారి అలాంటి దెబ్బ పడకపోతే వచ్చే ఆనందమే వేరుగా వుంటుంది. ఛలో సినిమాతో మాంచి హిట్ కొట్టింది నాగశౌర్య ఫ్యామిలీ. శౌర్య తల్లి, తండ్రి, బాబాయ్, అన్న, తమ్ముడు ఇలా ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా ప్రొడక్షన్ చూసుకుంటారు. అందుకే బాగా ఇన్వాల్వ్ అయిపోతారు. అలాంటి ఫ్యామిలీకి నర్తన శాల గట్టి షాక్ ఇచ్చింది.
దాంతొ కొన్నాళ్ల పాటు డీలా పడిపోయారు. ఎవరితో ఎవరూ మాట్లాడుకోలేనంతగా. ఆ తరువాత కోలుకుని, చాలా జాగ్రత్తగా మళ్లీ ప్రొడక్షన్ చేసి, అశ్వద్ధామ సినిమాను వదిలారు. ఇటు ప్రొడక్షన్ పరంగా, అటు మార్కెటింగ్ పరంగా గతంలో చేసిన తప్పులు చేయకూండా జాగ్రత్త పడ్డారు. నాన్ థియేటర్ మీద మంచి అమౌంట్ తెచ్చుకుని, థియేటర్ మీద రీజనబుల్ గా డిపెండ్ అయ్యారు.
తొలి మూడు రోజుల కలెక్షన్లు బాగానే వుండడం, మండే మరీ డ్రాప్ కాకపోవడంతో బయ్యర్లు మూడు వంతులు రికవరీ అయ్యారు. ఈవారం కూడా సరైన మాస్ లేదా మామూలు సినిమా లేదు. దాంతో శౌర్య ఫ్యామిలీకి సినిమా టెన్షన్లు తీరిపోయినట్లే. వెనక్కు ఇచ్చుకోవడాలు, లెక్కలు తేల్చుకోవడాలు లాంటి సమస్యలు లేవు.
శౌర్య కూడా సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సినిమా స్టార్ట్ చేయడానికి రెడీ అయిపోతున్నాడు. అందుకే శౌర్య ఫ్యామిలీ ఇప్పుడు హ్యాపీ.