ఆది సాయికుమార్ ‘సీఎస్ఐ సనాతన్’

ఆది సాయికుమార్ హీరోగా తయారవుతున్న సినిమా సిఎస్ఐ సనాతన్. డిఫరెంట్ సబ్ఙెక్ట్ తో తయారవుతున్న క్రయిమ్ థ్రిలర్ ఇది. ఈ సినిమాలో క్రైం సీన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా ఆది సాయికుమార్ నటిస్తున్నాడు.  Advertisement…

ఆది సాయికుమార్ హీరోగా తయారవుతున్న సినిమా సిఎస్ఐ సనాతన్. డిఫరెంట్ సబ్ఙెక్ట్ తో తయారవుతున్న క్రయిమ్ థ్రిలర్ ఇది. ఈ సినిమాలో క్రైం సీన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా ఆది సాయికుమార్ నటిస్తున్నాడు. 

ఓ ఇంటెన్సివ్ క్రయిమ్ థ్రిల్లర్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. ఈ మోషన్ పోస్టర్ లో సినిమా కాన్సెప్ట్ ను వివరించే ప్రయత్నం చేసారు.

ఈ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. ఒక బిల్డింగ్ లో జరిగిన హత్య కేసు ఇన్వెస్టిగేషన్ కోసం హీరో తన టీమ్ తో రావడం చూపించారు. క్రైమ్ జరిగిన ప్రాంతంలో పిస్టల్, కత్తి, కళ్లద్దాలు, ఫింగర్ ప్రింట్స్, బాడీ పడిఉన్న డ్రాయింగ్..ఇలా ఆధారాలు ఉన్నాయి. ఈ క్లూస్ తో నేరస్థులను హీరో ఎలా పట్టుకోబోతున్నాడు అనేది ఇంట్రెస్టింగ్ గా ఉండనుంది

చాగంటి ప్రొడ‌క్ష‌న్ బ్యానర్ మీద ఈ సినిమాను అజ‌య్ శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. శివశంకర్ దేవ్ దర్శకత్వం వహిస్తున్నారు.