తెలంగాణ మంత్రి హరీష్ రావు ఆంధ్రపై చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతల కౌంటర్లపై ఫిల్ అయి వీడియో రికార్డ్ చేసి వైసీపీ నేతలపై విమర్శలు చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై కాపు కార్పోరేషన్ ఛైర్మన్ అడపా శేఘ ఘాటుగా స్పందించారు. ఏపీలో చంద్రబాబు, తెలంగాణలో కేసీఆర్ దగ్గర పవన్ ప్యాకేజీలు తీసుకోని వైసీపీపై విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.
ఏపీ మంత్రులు తెలంగాణను, అక్కడి ప్రజలను ఏమీ అనలేదని… కేవలం హరీష్‌రావు చేసిన కామెంట్స్‌కి మాత్రమే బదులిచ్చారని. ఏపీ అభివృద్ధి గురించి హరీష్ మాట్లాడితే.. తెలంగాణలో పరిస్థితి గురించి మాట్లాడారన్నారు. రాజకీయ కక్షతో పవన్ ఏపీ మంత్రులపై బురద జల్లుతున్నారు అంటూ మండిపడ్డారు. ఏపీ మంత్రులనుద్దేశించిన పవన్ మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకొని ఏపీ ప్రజలకు పవన్ కల్యాణ్ క్షమాపణ చెప్పాలని శేషు డిమాండ్ చేశారు.
కాగా హరీష్ రావు- ఏపీ మంత్రుల మధ్య సద్దుమణిగిన వివాదంలో పవన్ అనవసరంగా రావడంతో తనపై ఉన్న ఫ్యాకేజీ ముద్ర మరోసారి వార్తల్లోకి వచ్చింది. గతంలో టీడీపీ అనుకుల పత్రికలో పవన్ కళ్యాణ్ కి 1000 కోట్లు ఫ్యాకేజీ సీఎం కేసీఆర్ ఆఫర్ చేసినట్లు వార్తలు రావడం తెలిసిందే.