జైలుకు వెళ్లలేదు.. నన్ను నమ్మండి ప్లీజ్

తాగి డ్రైవ్ చేసిన కేసులో యాంకర్ ప్రదీప్ కు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారనే విషయం అందరికీ తెలిసిందే. కానీ ఓ అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించిన కారణంగా అతడు 2 రోజులు జైలుశిక్ష అనుభవించాడనే విషయం…

తాగి డ్రైవ్ చేసిన కేసులో యాంకర్ ప్రదీప్ కు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారనే విషయం అందరికీ తెలిసిందే. కానీ ఓ అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించిన కారణంగా అతడు 2 రోజులు జైలుశిక్ష అనుభవించాడనే విషయం మాత్రం చాలా మందికి తెలియదు. సునిశిత్ అనే చిన్న దర్శకుడు ప్రదీప్ పై ఈ ఆరోపణలు చేశాడు. దీనిపై ప్రదీప్ ఘాటుగా స్పందించాడు.

తను జైలుశిక్ష అనుభవించాననే ఆరోపణలో నిజం లేదంటున్నాడు యాంకర్ ప్రదీప్. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో కౌన్సిలింగ్ కు హాజరైన మాట వాస్తవమేనని, ఆ విషయం అందరికీ తెలుసంటున్న ప్రదీప్.. ఓ అమ్మాయిని వేధించాననే ఆరోపణల్ని ఖండించాడు. అసలు తనపై ఆరోపణలు చేసిన ఆ దర్శకుడు ఎవరో తనకు తెలియదని.. కేవలం ప్రచారం కోసమే ఇలాంటి పనులు చేస్తున్నారని అంటున్నాడు. దయచేసి వాస్తవాలు తెలుసుకోవాలని, ఎవరో ఆరోపించారని తనపై తప్పుడు కథనాలు ప్రసారం చేయొద్దని మీడియాను కోరాడు.

హీరోగా మారి “30 రోజుల్లో ప్రేమించడం ఎలా” అనే సినిమా చేశాడు ప్రదీప్. జైలుశిక్ష అనుభవించిన ప్రదీప్ కు హీరో అయ్యే అర్హత లేదని, అతడు సెంట్రల్ ఫిలింబోర్డ్ నిబంధనలు అతిక్రమించాడంటూ కీసరకు చెందిన ఓ చిన్న దర్శకుడు ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై పోలీస్ స్టేషన్ లో అతడు కేసు కూడా పెట్టాడు. ఈ వ్యవహారంపై ప్రదీప్ స్పందించాడు. తను జైలుశిక్ష అనుభవించలేదంటున్నాడు.

“30 రోజుల్లో ప్రేమించడం ఎలా” అనే సినిమాకు మంచి బజ్ వచ్చింది. ఇందులోని ఓ పాటను మహేష్ బాబు రిలీజ్ చేశాడు. సిద్ శ్రీరామ్ పాడిన ఆ పాట సూపర్ హిట్టయింది. నీలి నీలి ఆకాశం అనే లిరిక్స్ తో సాగే ఈ పాటకు అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు. ఇలా ఈ పాట హిట్టవ్వడం, అటు ప్రదీప్ పై ఆరోపణలు రావడం ఒకేసారి జరిగిపోయాయి.

సమంత-శర్వా-ప్రేమ్ ముగ్గురు కలిసి మ్యాజిక్ చేసారు