కుక్కలా, రాబందులా.. మనిషిని పీక్కుతిన్నాయ్

కుక్కలు మాంసాహారులే కానీ, మనుషుల్ని పీక్కుతినేంత క్రూర మృగాలు మాత్రం కావు అనేది ఇప్పటివరకూ ఉన్న అంచనా. పిట్ బుల్ డాగ్స్ వంటివి మనుషుల్ని కూడా స్వాహా చేస్తాయనే ఉదాహరణలున్నా.. అలాంటి సంఘటనలు కూడా…

కుక్కలు మాంసాహారులే కానీ, మనుషుల్ని పీక్కుతినేంత క్రూర మృగాలు మాత్రం కావు అనేది ఇప్పటివరకూ ఉన్న అంచనా. పిట్ బుల్ డాగ్స్ వంటివి మనుషుల్ని కూడా స్వాహా చేస్తాయనే ఉదాహరణలున్నా.. అలాంటి సంఘటనలు కూడా అరుదుగానే జరుగుతుంటాయి. కానీ ఇటీవల హైదరాబాద్ లో కుక్కల కాటుకి ఓ బాలుడు బలైపోయిన ఘటన తర్వాత అసలు కుక్కలు ఎందుకిలా దాడి చేస్తున్నాయనే చర్చ మొదలైంది.

పోనీ చిన్న పిల్లవాడు కుక్కల్ని అదిలించలేక, వాటినుంచి తప్పించుకోలేక చనిపోయాడనుకోవచ్చు. ఉత్తర ప్రదేశ్ లో 65 ఏళ్ల ఓ వ్యక్తి కుక్కల దాడిలో మృత్యువాత పడ్డాడు. అతడికి తప్పించుకునే వీలుంది కానీ, కుక్కల గుంపు ఒక్కసారిగా దాడి చేసి అతి క్రూరంగా ఆ వ్యక్తిని చంపేశాయి.

కుక్కల వేట..

ఉత్తర ప్రదేశ్‌ లోని అలీఘర్ ముస్లిం యూనివర్సిటీలో ఈ ఉదయం జాగింగ్ కి వచ్చిన డాక్టర్ సఫ్దర్ అలీని కుక్కలు దారుణంగా చంపేశాయి. యూనివర్శిటీ క్యాంపస్‌ లోని పార్క్‌ లో సఫ్దర్ అలీ నిలబడి ఉన్నాడు. అంతలో ఓ కుక్క అతడి వైపు వచ్చింది. దాన్ని అదిలించేలోపు మరో కుక్క వచ్చింది. ఆ రెండింటినీ తప్పించుకునే సమయంలో మరిన్ని కుక్కలు వరుసగా దాడి చేశాయి. రెప్పపాటులో అతడిని కుక్కల గుంపు చుట్టుముట్టింది. తేరుకునే లోపే తీవ్రంగా అవి గాయపరిచాయి. రాబందుల గుంపు దాడి చేసి పీక్కుతిన్నట్టు.. కుక్కలు అతడిని తీవ్రంగా గాయపరిచాయి. తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే సఫ్దర్ అలీ మృతి చెందాడు.

సీసీ టీవీ ఫుటేజ్..

ఉదయం ఏడున్నర గంటలకు పార్క్ లో మృతదేహం పడి ఉండటాన్ని గమనించిన సిబ్బందికి అసలేం జరిగిందో అర్థం కాలేదు. అక్కడ మర్డర్ జరిగిందా అనే అనుమానం వారికి వచ్చింది. చివరికి సీసీ కెమెరాల ఫుటేజీ చూడటంతో అసలు విషయం తెలిసింది. డాక్టర్ సఫ్దర్ అలీపై కుక్కల దాడి భయానకంగా ఉంది. యూనివర్శిటీ క్యాంపస్ లోని సివిల్ లైన్స్ ప్రాంతంలో ఉదయం ఆరున్నర గంటలకే ఈ దాడి జరిగింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.

ఆ మూడూ డేంజర్.. కానీ..!

నోయిడా సమీపంలోని ఘజియాబాద్ జిల్లాలో మూడు జాతుల కుక్కలను పెంచుకోడానికి అనుమతి లేదు. పిట్‌ బుల్, రోట్‌ వీలర్, డోగో అర్జెంటీనో జాతి కుక్కలపై నిషేధం ఉంది. అయితే ఈరోజు జరిగిన దారుణానికి వీధి కుక్కలే కారణం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.