వైసీపీ నేతలూ… తప్పు చేయవద్దు !

ఇది సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు చేసిన సూచన అనుకోవచ్చు. హెచ్చరికగా కూడా తీసుకోవచ్చు. వైసీపీ నేతలూ కార్యకర్తలూ ఆ తప్పు మాత్రం చేయకండి అని సుతిమెత్తగానే చెప్పారు. వైసీపీ నేతలు చేస్తున్న తప్పుని…

ఇది సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు చేసిన సూచన అనుకోవచ్చు. హెచ్చరికగా కూడా తీసుకోవచ్చు. వైసీపీ నేతలూ కార్యకర్తలూ ఆ తప్పు మాత్రం చేయకండి అని సుతిమెత్తగానే చెప్పారు. వైసీపీ నేతలు చేస్తున్న తప్పుని ఆయన ఎత్తి చూపారు.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సమగ్రమైన అభివృద్ధి జరుగుతోందని దానికి కనుక మనమే చెప్పుకోకపోతే విపక్షాలు చేసే విష ప్రచారమే నిజం అనుకునే ప్రమాదం ఉందని ఆయన అందోళన వ్యక్తం చేశారు. ఉమ్మడి ఏపీలోనూ విభజన తరువాత సైతం ఉత్తరాంధ్రాలో అత్యంత వెనకబాటుకు గురి అయిన జిల్లా ఏదైనా ఉందంటే అది శ్రీకాకుళం అని ఆయన అంటున్నారు. అలాంటి శ్రీకాకుళం జిల్లాకు ఇప్పటిదాకా ఏ ప్రభుత్వం కూడా చేయని విధంగా అభివృద్ధికి బాటలు వేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కే దక్కుతుందని ధర్మాన అంటున్నారు.

భావనపాడు పోర్టుతో జిల్లా దశ దిశ తిరుగుతుందని, ప్రత్యక్షంగా పరోక్షంగా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన గుర్తు చేశారు. ప్రజల ఆదాయాలు పెరుగుతాయనిక్ కొనుగోలు శక్తి పెరుగుతుందని జిల్లాకే ఆర్ధిక స్వావలంబన చేకూరుతుందని మంత్రి వివరించారు. భావనపాడు పోర్టు కేంద్రీకృతం అయిన చోటు నుంచి చుట్టు పక్కల అంతా పౌర సముదాయాలు అభివృద్ధి చెందుతాయని వివరించారు.

గడచిన నాలుగేళ్ల కాలంలో జిల్లాలో పోర్టుతో పాటు ఇచ్చాపురంలో డయాలిసిస్ యూనిట్లు, పలాసలో కిడ్నీ పరిశోధనా కేంద్రం ఏర్పాటు, టెక్కలిలో ఆఫ్ షోర్ రిజర్వాయర్, పాతపట్నం పరిధిలో గొట్ట బ్యారేజ్ వద్ద పందొమ్మిది టీఎంసీల నీటిని వినియోగించుకునేలా ఎత్తి పోతల పధకానికి శంకుస్థపాన వంటివి జిల్లా స్వరూప స్వభావాలను పూర్తిగా మార్చివేస్తాయని సీనియర్ మంత్రి వెల్లడించారు.

ఈ అభివృద్ధిని నలు దిక్కులా చాటాలని ఆయన కోరారు, అభివృద్ధి లేదు అని దారుణమైన విమర్శలు చేసే విపక్షాలకు చెక్ పెట్టేలా ప్రజల వద్దకు వాస్తవాలను తీసుకెళ్లాలని అలా కనుక చేయకపోతే మాత్రం నష్టపోతామని హెచ్చరించారు. వైసీపీ నేతలు చేస్తున్న తప్పు ఏంటో సీనియర్ మంత్రి ఎత్తి చూపారు.