‘భీమ్లా’ వస్తే ‘ఆడవాళ్లు’ పక్కకు

శర్వానంద్ ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా విడుదల ఫిబ్రవరి 25 అంటూ ప్రకటించేసరికి అందరికీ అనుమానం. పవన్ భీమ్లానాయక్ ఆ రోజు రాదా? వాయిదా పడిందా? అంటూ. కానీ వీళ్లకు తెలియని విషయం ఏమిటంటే…

శర్వానంద్ ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా విడుదల ఫిబ్రవరి 25 అంటూ ప్రకటించేసరికి అందరికీ అనుమానం. పవన్ భీమ్లానాయక్ ఆ రోజు రాదా? వాయిదా పడిందా? అంటూ. కానీ వీళ్లకు తెలియని విషయం ఏమిటంటే భీమ్లానాయక్ వస్తే శర్వానంద్ సినిమా డేట్ మారుతుందని.

బయ్యర్లు అందరికీ ఈ సమాచారం అందించిన తరువాతే ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా యూనిట్ విడుదల డేట్ వేసింది.సెకెండ్ షో ఇవ్వకపోతే, యాభై శాతం ఆక్యపెన్సీ నిబంధన తీసి వేయకపోతే భీమ్లా నాయక్ రాదు. 

అందులో సందేహం లేదు. కానీ ఫిబ్రవరి రెండో వారానికి ఈ నిబంధనలు మారుతాయని టాక్. అలా మారితే భీమ్లా 25నే బరిలోకి దిగుతుంది. అప్పుడు శర్వానంద్ సినిమా వెనక్కు వెళ్లిపొవడం పక్కా. 

ఆ మేరకు యూనిట్ పక్కా క్లారిటీతో వుంది. లేదూ నిబంధనలు మారకపోతే భీమ్లా రాదు. యాభై శాతం ఆక్యుపెన్సీ సరిపోతుంది కనుక శర్వానంద్ సినిమా వస్తుంది.