పెద్దన్నది మళ్లీ అదే దీనావస్థ

కొన్నేళ్లుగా రజనీకాంత్ సినిమాలు థియేటర్లలో ఫ్లాప్ అవుతున్నాయి. ఆమధ్య వచ్చిన పెద్దన్న సినిమా కూడా ఫ్లాప్ అయింది. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే.. అలా ఫ్లాప్ అయిన సినిమాలు టీవీల్లో కూడా ఫెయిల్ అవుతూ…

కొన్నేళ్లుగా రజనీకాంత్ సినిమాలు థియేటర్లలో ఫ్లాప్ అవుతున్నాయి. ఆమధ్య వచ్చిన పెద్దన్న సినిమా కూడా ఫ్లాప్ అయింది. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే.. అలా ఫ్లాప్ అయిన సినిమాలు టీవీల్లో కూడా ఫెయిల్ అవుతూ వస్తున్నాయి. ఇప్పుడు పెద్దన్న సినిమా కూడా ఆ జాబితాలోకి చేరిపోయింది.

రజనీకాంత్ హీరోగా నటించిన పెద్దన్న సినిమాను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా జెమినీ టీవీలో ప్రసారం చేస్తే, కేవలం 6.35 (ఏపీ+తెలంగాణ అర్బన్) రేటింగ్ మాత్రమే వచ్చింది. రజనీకాంత్ సినిమాలకు ఇది చాలా చిన్న టీఆర్పీ. ఇంకా చెప్పాలంటే.. ఆ వారం పెద్దన్న సినిమా కంటే స్టార్ మా ఛానెల్ లో వేసిన టక్ జగదీష్ సినిమాకు ఎక్కువ రేటింగ్ వచ్చింది.

కొన్నాళ్లుగా తెలుగులో రజనీకాంత్ హవా తగ్గింది. ఆయన ఎంచుకుంటున్న కథలు అలా ఉన్నాయి. దర్శకుల విషయంలో కొత్తదనం చూపిస్తున్న తళైవ.. కథల విషయంలో మాత్రం ఆ కొత్తదనం చూపించలేకపోతున్నారు. ఇక పెద్దన్న విషయానికొస్తే, ఇదొక సాదాసీదా నాసిరకం కథ. సూపర్ స్టార్ తో పాటు కీర్తిసురేష్, నయనతార, ఖుష్బూ, మీనా, జగపతిబాబు, ప్రకాష్ రాజ్ లాంటి స్టార్స్ ఉన్నప్పటికీ ఈ సినిమా క్లిక్ అవ్వలేదు.

అయితే సదరు ఛానెల్ మాత్రం చాలా హోప్స్ పెట్టుకుంది. ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉన్న కథ కాబట్టి బుల్లితెరపై ఢోకా ఉండదని భావించింది. మరీ ముఖ్యంగా సిస్టర్ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందని నమ్మకం పెట్టుకుంది. కానీ పెద్దన్న మాత్రం నిరాశపరిచాడు.