నిఖిల్ గర్ల్ ఫ్రెండ్ ఎవరో తెలిసిపోయింది. కొన్నాళ్లుగా ఈ హీరో ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్నాడని, ఆమెనే పెళ్లి చేసుకుంటాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాటిని నిజం చేస్తూ.. నిఖిల్, తన ప్రేయసితో పెళ్లికి రెడీ అయిపోయాడు.
భీమవరంకు చెందిన పల్లవి వర్మతో కొన్నాళ్లుగా డేటింగ్ చేస్తున్నాడు నిఖిల్. వీళ్లిద్దరి ఎంగేజ్ మెంట్ గోవాలో జరిగింది. పెళ్లి మాత్రం హైదరాబాద్ లోనే ఉంటుంది. ఏప్రిల్ 16న నిఖిల్-పల్లవి పెళ్లి చేసుకోబోతున్నారు. ఆమె ఓ డాక్టర్.
టాలీవుడ్ లో పెళ్లి అనగానే అంతా నితిన్ వైపు చూశారు. సమ్మర్ లో దుబాయ్ లో ఈ హీరో పెళ్లి చేసుకోబోతున్నాడు. అతడి పెళ్లికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ బయటకు వస్తూనే ఉన్నాయి. అంతలోనే నిఖిల్ సైలెంట్ గా నిశ్చితార్థం చేసుకున్నాడు. ఆ ఫొటోల్ని కూడా రిలీజ్ చేశాడు.
రీసెంట్ గా అర్జున్ సురవరం సినిమాతో సక్సెస్ అందుకున్నాడు నిఖిల్. ప్రస్తుతం కార్తికేయ-2 సినిమా చేస్తున్నాడు. పెళ్లి టైమ్ కు ఈ సినిమాను పూర్తిచేసేలా ప్లాన్ చేస్తున్నాడు.