తెలుగు రాష్ట్రాల్లో నాన్-బాహుబలి రికార్డ్ మాదంటే మాదంటూ పోస్టర్ల యుద్ధం చేస్తున్నారు మహేష్-బన్నీ. ఎందుకంటే ఇక్కడ వసూళ్లలో మతలబులు, చేతివాటాలు ఆ రేంజ్ లో ఉంటాయి మరి. ఇక్కడి సంగతి పక్కనపెడితే, ఓవర్సీస్ లో మాత్రం బన్నీ నిజంగానే నాన్-బాహుబలి రికార్డ్ సృష్టించాడు. తాజా వసూళ్లతో అల వైకుంఠపురములో సినిమా ఈ ఘనత సాధించింది.
మొన్నటివరకు ఓవర్సీస్ లో నాన్-బాహుబలి రికార్డ్ చరణ్ పేరిట ఉండేది అతడు నటించిన రంగస్థలం సినిమా ఆల్ టైమ్ హిట్స్ టాప్-10లో మూడో స్థానంలో (35,13,450 డాలర్లు) ఉండేది. ఇప్పుడీ రికార్డును అల వైకుంఠపురములో క్రాస్ చేసింది. వరుసగా నాలుగో శనివారం కూడా ఈ సినిమాకు మంచి వసూళ్లు (45వేల డాలర్లు) రావడంతో నాన్-బాహుబలి రికార్డు సృష్టించాడు బన్నీ.
అయితే బాహుబలి-1ను బీట్ చేయడం మాత్రం బన్నీ తరం కాదు. బాహుబలి-1, అల వైకుంఠపురములో సినిమా మధ్య వసూళ్ల పరంగా చాలా తేడా ఉంది. బాహుబలి-1 తెలుగు వెర్షన్ కు 6.9 మిలియన్ డాలర్ వసూళ్లు వస్తే.. కంప్లీట్ రన్ లో అల వైకుంఠపురం సినిమా 4 మిలియన్ డాలర్ మార్క్ ను కూడా టచ్ చేయకపోవచ్చు.