గుబురు గడ్డంతో ప్రభాస్.. వైరల్ పిక్

ఈ కాలం ఎప్పుడు ఏ సినిమా నుంచి స్టిల్స్ లీక్ అవుతాయో ఎవ్వరూ చెప్పలేరు. మొన్నటికిమొన్న ఎన్టీఆర్ కొత్త సినిమా నుంచి స్టిల్స్ లీక్ అయ్యాయి. ఇప్పుడు ప్రభాస్ కొత్త సినిమా స్టిల్ లీక్…

ఈ కాలం ఎప్పుడు ఏ సినిమా నుంచి స్టిల్స్ లీక్ అవుతాయో ఎవ్వరూ చెప్పలేరు. మొన్నటికిమొన్న ఎన్టీఆర్ కొత్త సినిమా నుంచి స్టిల్స్ లీక్ అయ్యాయి. ఇప్పుడు ప్రభాస్ కొత్త సినిమా స్టిల్ లీక్ అయింది.

మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. పీపుల్ మీడియా బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా, ఇప్పుడు లీకుల బారిన పడింది.

తాజా ఈ సినిమా సెట్ నుంచి ఓ వర్కింగ్ స్టిల్ లీక్ అయింది. ఈ ఫొటోలో గుబురు గడ్డంతో కనిపిస్తున్నాడు ప్రభాస్. పక్కనే హీరోయిన్ రిద్ది కుమార్ కూడా ఉంది. లీక్ అయిన వెంటనే సదరు స్టిల్ వైరల్ అయింది. సినిమా మొత్తం ప్రభాస్ ఇలా గుబురు గడ్డంతోనే కనిపిస్తాడా లేక ఏదైనా ఓ సీన్ కోసం ఇలా చేశాడా అనే ఇంట్రెస్టింగ్ చర్చ కూడా మొదలైంది.

ఈ సినిమాలో ప్రభాస్ సరసన రిద్ది కుమార్ తో పాటు, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మాళవిక మోహనన్ మెయిన్ హీరోయిన్. ఈ సినిమా కోసం ఓ పాత థియేటర్ సెట్ వేశారు. అందులో కొంత షెడ్యూల్ షూట్ నడిచింది.

ప్రస్తుతం ప్రభాస్ చేతిలో చాలా సినిమాలున్నాయి. అన్నీ సెట్స్ పై ఉన్నాయి. కానీ ఏ సినిమా నుంచి ప్రచారం స్టార్ట్ కావడం లేదు. దీనికి కారణం ఆదిపురుష్. ఆ సినిమా థియేటర్లలోకి వచ్చేంత వరకు మిగతా సినిమాల షూటింగ్స్ జరుగుతాయి తప్ప, ప్రమోషన్ మాత్రం స్టార్ట్ అవ్వదు. ఈలోగా ఇలా ఎన్ని లీకులు జరుగుతాయో..!