వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ మార్కెట్ లో, అన్ని సౌకర్యాలు అందిస్తూ, అత్యధిక రిటర్నులు ఇచ్చే ప్రాపర్టీలో పెట్టుబడి పెట్టడం చాలా శ్రమతో కూడుకున్న వ్యవహారం. పెట్టుబడి పెట్టేముందు, వివిధ ప్రాజెక్టుల్ని సందర్శించి, జాగ్రత్తగా విశ్లేషించి నిర్ణయం తీసుకోవాలి. అనేక ఎంపికలతో కూడిన ప్రాపర్టీలు గృహ వినియోగదారులకు అందుబాటులో ఉంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
రాబోయే రోజుల్లో తమ సొంత ఇంటి కలను నెరవేర్చుకోవడానికి లేదా రియల్ ఎస్టేట్‌లో మంచి పెట్టుబడి అవకాశాల కోసం ఎదురుచూసే వారికి, TV9 స్వీట్ హోమ్ రియల్ ఎస్టేట్ & ఇంటీరియర్స్ ఎక్స్‌పో సరైన వేదిక. పెట్టుబడిదారులంతా తప్పనిసరిగా సందర్శించాల్సిన ఈవెంట్ ఇది. భారతదేశంలోని అతిపెద్ద న్యూస్ నెట్‌వర్క్‌లలో ఒకటైన TV9 నెట్‌వర్క్, హైదరాబాద్, బెంగళూరు, వైజాగ్, మైసూరు, మంగళూరు, అహ్మదాబాద్, కోల్‌కతా, సూరత్ తో పాటు భారతదేశంలోని ప్రధాన నగరాల్లో ఎక్స్‌పోలను నిర్వహిస్తోంది. మంచి కస్టమర్లను, ప్రముఖ డెవలపర్లను కలుపుతూ అందరి మన్ననలు పొందింది TV9 స్వీట్ హోమ్ రియల్ ఎస్టేట్ & ఇంటీరియర్స్ ఎక్స్‌పో. గతేడాది సెప్టెంబర్ లో నిర్వహించిన TV9 స్వీట్ హోమ్ ఎక్స్ పోను 20వేల మందికి పైగా సందర్శించారు. ఈ మార్కెట్లో ఇదొక రికార్డ్.
TV9 స్వీట్ హోమ్ రియల్ ఎస్టేట్ & ఇంటీరియర్స్ ఎక్స్‌పో.. ఏప్రిల్ 14, 15, 16, తేదీల్లో హైదరాబాద్ లోని హైటెక్ సిటీలో ఉన్న హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో జరుగుతుంది. రియల్ ఎస్టేట్ డెవలపర్లు, అత్యాధునిక ఫర్నిచర్ ఎంపికలు, ఫర్నిషింగ్ బ్రాండ్‌లు, ఇంటీరియర్ డిజైనర్లు, హోమ్ డెకర్ ఆప్షన్‌లతో విస్తృత శ్రేణిని ఈ ఎక్స్ పోలో చూడొచ్చు. అలాగే ఆర్థిక సహాయం పొందాలనుకునే కస్టమర్లు బ్యాంకులు అందించే రుణాలపై సమాచారాన్ని పొందవచ్చు. ఈ సేవలన్నీ ఒకే వేదికపై అందుబాటులో ఉంటాయి.
“మెరుగైన సమాజం కోసం” పని చేయడానికి కట్టుబడి ఉన్న TV9 ద్వారా వస్తున్న ఈ ప్రదర్శన, రియల్ ఎస్టేట్ పరిశ్రమలోని ప్రముఖ కంపెనీలను, ఇల్లు కొనాలనుకునే వినియోగదారులను కలుపుతుంది. ఈ ఎక్స్ పో విక్రేతలు, కొనుగోలుదారులు ఇద్దరికీ లాభదాయకంగా ఉంటుంది. ఇది నిస్సందేహంగా ప్రజలకు ఒక మెగా అవకాశం, ఎందుకంటే వారు బెస్ట్ డీల్స్ కోసం ఎక్కడెక్కడో తిరిగి, వెదకాల్సిన అవసరం లేదు.
సమాజంలోని అన్నివర్గాల వారికి అందుబాటులో ఉండే ధరలతో పాటు, విలాసవంతమైన ఎంపికల వరకు అన్నింటినీ అందిస్తుంది TV9 స్వీట్ హోమ్ రియల్ ఎస్టేట్ & ఇంటీరియర్స్ ఎక్స్‌పో. కస్టమర్లు తమ అభిరుచి, బడ్జెట్, ప్రాధాన్యతల ప్రకారం ఆప్షన్లు ఎంచుకోవచ్చు.
ఈ ప్రసిద్ధ రియల్ ఎస్టేట్ ఎక్స్‌పో ప్రాపర్టీలను కొనుగోలు చేసే వారి ఆకాంక్షలను నెరవేర్చడంలో మంచి ట్రాక్ రికార్డ్ కలిగి ఉంది. సందర్శకుల సౌలభ్యం కోసం విస్తారమైన పార్కింగ్ స్థలం అందుబాటులో ఉంది. అంతేకాదు, ప్రవేశం కూడా ఉచితం.
తేదీ: ఏప్రిల్ 14, 15, 16
వేదిక: హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్, హైటెక్ సిటీ