చరణ్ సరసన రవీనా టాండన్ కూతురు?

ఆమధ్య శ్రీదేవి కూతురు జాన్వికపూర్ ను టాలీవుడ్ కు పరిచయం చేయడానికి హీరోలంతా తెగ ట్రై చేశారు. ఎట్టకేలకు ఆ అవకాశం ఎన్టీఆర్ కు దక్కింది. దేవర సినిమాతో జాన్విని టాలీవుడ్ కు పరిచయం…

ఆమధ్య శ్రీదేవి కూతురు జాన్వికపూర్ ను టాలీవుడ్ కు పరిచయం చేయడానికి హీరోలంతా తెగ ట్రై చేశారు. ఎట్టకేలకు ఆ అవకాశం ఎన్టీఆర్ కు దక్కింది. దేవర సినిమాతో జాన్విని టాలీవుడ్ కు పరిచయం చేస్తున్నాడు తారక్. ఇప్పుడు చరణ్ వంతు వచ్చింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే, మరో హీరోయిన్ కూతుర్ని టాలీవుడ్ కు పరిచయం చేయబోతున్నాడు రామ్ చరణ్.

త్వరలోనే బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు రామ్ చరణ్. ఈ సినిమాలో హీరోయిన్ గా రవీనా టాండన్ కూతురు రాషా తడానీ ని తీసుకునే ఆలోచనలో ఉన్నారు. అయితే ఇంకా నిర్ణయం తీసుకోలేదు. రీసెంట్ గా రాషా పై టెస్ట్ కట్ చేశాడు బుచ్చిబాబు.

సినిమాలో తను అనుకున్న పాత్రకు రాషా తడానీ లుక్స్ మ్యాచ్ అయితే వెంటనే ఆమెను తీసుకుంటాడు. ఈ విషయంలో బుచ్చిబాబు నిర్ణయానికి రామ్ చరణ్ అభ్యంతరం వ్యక్తం చేయకపోవచ్చు. అయితే రాషాతో పాటు మరికొంతమందిపై కూడా టెస్ట్ కట్ చేశాడు దర్శకుడు. ఎవరు ఫైనల్ అవుతారనేది త్వరలోనే తెలుస్తుంది.

ఈ సినిమాకు ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ రెహ్మాన్ తో జర్నీ స్టార్ట్ చేశాడు బుచ్చిబాబు. సినిమాకు సంబంధించి ఆల్రెడీ ఓ సాంగ్ లాక్ అయింది. రఫ్ వెర్షన్ కంపోజిషన్ కూడా రెడీ అయింది. శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ మూవీ చేస్తున్నాడు రామ్ చరణ్. ఈ సినిమా ఓ కొలిక్కి వచ్చిన వెంటనే, బుచ్చిబాబు సినిమా స్టార్ట్ అవుతుంది.