నేను అలా చేయ‌లేనుః ఐశ్వ‌ర్య

ప్ర‌తి అంశంపై క్లారిటీతో ఉండ‌టం ఇప్ప‌టి హీరోయిన్ల ప్ర‌త్యేకం. త‌మిళంలో గుర్తింపు తెచ్చుకుని తెలుగు చిత్ర‌సీమ‌లో అడుగు పెట్టిన ఐశ్వ‌ర్య రాజేష్ కేవ‌లం అంద‌గ‌త్తె మాత్రం కాదు, అంతే తెలివి తేట‌లున్న హీరోయిన్ కూడా.…

ప్ర‌తి అంశంపై క్లారిటీతో ఉండ‌టం ఇప్ప‌టి హీరోయిన్ల ప్ర‌త్యేకం. త‌మిళంలో గుర్తింపు తెచ్చుకుని తెలుగు చిత్ర‌సీమ‌లో అడుగు పెట్టిన ఐశ్వ‌ర్య రాజేష్ కేవ‌లం అంద‌గ‌త్తె మాత్రం కాదు, అంతే తెలివి తేట‌లున్న హీరోయిన్ కూడా. క్రాంతిమాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ‘వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్స్‌’లో విజ‌య్ దేవ‌ర‌కొండ స‌ర‌స‌న ఐశ్వ‌ర్య న‌టించారు. ఈ చిత్రం ఈ నెల 14న ప్రేమికుల రోజు విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా ఐశ్వ‌ర్య బోలెడు విష‌యాలు మీడియాతో పంచుకున్నారు.

‘నేను తెలుగ‌మ్మాయినే అయినా పుట్టి పెరిగింది చెన్నైలోనే. దీంతో నా సినీ ప్ర‌స్థానాన్ని అక్క‌డి నుంచే మొద‌లు పెట్టాను. నిజానికి నేను సినిమాల్లోకి రావాల‌నుకున్న‌ప్పుడు ఒక మంచి తెలుగు చిత్రంతో మొద‌లు పెట్ట‌మ‌ని ఇంట్లో వాళ్లు సూచించారు. అయితే తెలుగులో ఎవ‌రిని సంప్ర‌దించాలో తెలియ‌లేదు. దీనికి తోడు తెలుగులో గ్లామ‌ర్ పాత్ర‌లు పోషించే హీరోయిన్‌ల‌కు ప్రాధాన్యం ఇస్తారు. ఎలాంటి పాత్ర‌కైనా సిద్ధంగా ఉండాలి. కానీ నేను అలా చేయ‌లేను. నాకంటూ కొన్ని ప‌రిమితులున్నాయి. అందుకే తెలుగులో న‌టించ‌డానికి టైం ప‌ట్టింది’ అని త‌న సినీ ప్ర‌యాణాన్ని వివ‌రించారామె.

‘ముద్దు స‌న్నివేశాలు ఉన్నంత మాత్రాన ఏ సినిమా చెడ్డ‌ది కాదు. ఎందుకంటే ముద్దు అనేది నిషేధిత‌మైంది కాదు. ముద్దు లేక‌పోతే మంచిద‌ని కూడా చెప్ప‌లేం. ముద్దు అయిన‌, మ‌రొక‌టైనా సినిమా క‌థ‌లో భాగ‌మై ఉండాల్సిందే’ అని ఐశ్వ‌ర్య ముద్దుముద్దుగా ముచ్చ‌ట్లు చెప్పారు.

విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాలో హీరోయిన్‌ల‌కి ఇంపార్టెన్స్ ఇస్తారు, అందుకే ఆయ‌న‌తో న‌టించే అవ‌కాశం వ‌స్తే వ‌దులుకోవ‌ద్ద‌ని గ‌ట్టిగా నిర్ణ‌యించుకుని ఈ సినిమాకు ఒప్పుకున్న‌ట్టు ఆమె తెలిపారు. వ్య‌క్తిగ‌తంలో జ‌య‌ల‌లిత , సౌంద‌ర్య అంటే త‌న‌కిష్ట‌మ‌ని చెప్పారామె. ప్ర‌స్తుతం తెలుగులో నానితో క‌ల‌సి ‘ట‌క్ జ‌గ‌దీష్’  చేస్తున్న‌ట్టు ఐశ్వ‌ర్య రాజేష్ తెలిపారు.

మరో పెళ్లిచూపులు