ఇంటికే న‌డిచొచ్చిన పింఛ‌న్‌

తాను అధికారంలోకి వ‌స్తే నేరుగా ఇంటి ద‌గ్గ‌రికే వ‌చ్చి పింఛ‌న్ల పంపిణీ చేప‌డ‌తాన‌ని వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ ఇచ్చిన హామీ నెర‌వేరింది. ఫిబ్ర‌వ‌రి 1న ఉద‌యం ఆరు గంట‌ల‌కే ‘పింఛ‌న్’ ల‌బ్ధిదారుల త‌లుపు…

తాను అధికారంలోకి వ‌స్తే నేరుగా ఇంటి ద‌గ్గ‌రికే వ‌చ్చి పింఛ‌న్ల పంపిణీ చేప‌డ‌తాన‌ని వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ ఇచ్చిన హామీ నెర‌వేరింది. ఫిబ్ర‌వ‌రి 1న ఉద‌యం ఆరు గంట‌ల‌కే ‘పింఛ‌న్’ ల‌బ్ధిదారుల త‌లుపు త‌ట్టింది.  అవ్వాతాత‌ల జీవితాల్లో ఆనందం , సంతోషం చూడాల‌న్న‌దే త‌మ ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని సీఎం జ‌గ‌న్ ఆకాంక్షించారు. అందుకు త‌గ్గ‌ట్టుగానే ల‌బ్ధిదారులు ఇంకా నిద్ర‌లేవ‌క‌నే, సూర్యోద‌యం కాక‌మునుపే వ‌లంటీర్లు ల‌బ్ధిదారుల ఇళ్ల‌కు చేరుకున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ తదితర పింఛనుదారులందరికీ వలంటీర్ల ద్వారా నేరుగా వారి ఇంటి వద్దనే పింఛను డబ్బుల పంపిణీ ప్ర‌క్రియ‌ను ఫిబ్ర‌వ‌రి ఒక‌టి నుంచి జ‌గ‌న్ స‌ర్కార్ చేప‌ట్టింది. అంతేకాకుండా ప్రభుత్వం ‘నవశకం’  ద్వారా రాష్ట్రంలో 6.11 లక్షల మందిని అర్హులుగా గుర్తించింది. వారందరికీ  ఈ నెల ఒక‌టి నుంచి కొత్తగా పింఛన్లు మంజూరు చేసింది. కొత్తగా పింఛను మంజూరైన వాళ్ల‌కు సీఎం వైఎస్‌ జగన్  శుభాభినందనలు తెలియజేస్తూ లేఖలు రాశారు.

 కొత్తగా పింఛన్లు మంజూరైన వారందరికీ సంబంధిత పత్రాలతో పాటు సీఎం వారి పేరుతో రాసిన లేఖ ప్రతులను కూడా వ‌లంటీర్లు   అందజేస్తున్నారు. పింఛ‌న్ల పంపిణీ శ‌నివారం మ‌ధ్యాహ్నానికి పూర్తి అవుతుంద‌ని గ్రామీణ పేద‌రిక నిర్మూల‌న సంస్థ (సెర్ప్‌) సీఈఓ రాజాబాబు తెలిపారు. ఏవైనా కార‌ణాల‌తో మొద‌టి రోజు పింఛ‌న్ సొమ్ము తీసుకోని వారికి మ‌రో రెండు రోజుల్లో ఎప్పుడైనా వ‌లంటీర్ల ద‌గ్గ‌రి నుంచి తీసుకునేలా ప్ర‌భుత్వం ఏర్పాట్లు చేసింది.

మరో పెళ్లిచూపులు