ఎన్టీఆర్ సినిమా.. లీకులు మొదలు

ఓ పెద్ద సినిమా సెట్స్ పైకి వచ్చిందంటే చాలు ఆటోమేటిగ్గా లీకులు మొదలైబోతున్నాయి. వీటిని ఆపడం ఎవ్వరితరం కావడం లేదు. ఇప్పుడు ఎన్టీఆర్ కొత్త సినిమాకు కూడా ఈ లీకుల తలనొప్పి మొదలైంది. మొదటి…

ఓ పెద్ద సినిమా సెట్స్ పైకి వచ్చిందంటే చాలు ఆటోమేటిగ్గా లీకులు మొదలైబోతున్నాయి. వీటిని ఆపడం ఎవ్వరితరం కావడం లేదు. ఇప్పుడు ఎన్టీఆర్ కొత్త సినిమాకు కూడా ఈ లీకుల తలనొప్పి మొదలైంది. మొదటి షెడ్యూల్ కే ఫొటోలు బయటకొచ్చాయి.

కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ షెడ్యూల్ పూర్తయింది. హైదరాబాద్ శివార్లలో వేసిన సెట్ లో ఎన్టీఆర్ పై కొన్ని సన్నివేశాలు తీశారు. వీటిలో కొన్ని స్టిల్స్ సోషల్ మీడియాలో లీకయ్యాయి.

నైట్ ఎఫెక్ట్ లో వేసిన సెట్ లో, కలర్ ఫుల్ డ్రెస్ తో కనిపిస్తున్నాడు ఎన్టీఆర్. ఓ పార్టీకి లేదా సాంగ్ కు సంబంధించిన సీన్ లా ఉంది వాతావరణం. అల్లంత దూరం నుంచి ఎవరో క్లిక్ మనిపించారు. ప్రస్తుతం ఈ స్టిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

లీకుల్ని అపడానికి మేకర్స్ ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ప్రయోజనం ఉండడం లేదు. రాజమౌళి లాంటి టాస్క్ మాస్టర్ కే ఇది సాధ్యం కాలేదు. ఒకప్పుడు ఔట్ డోర్ షూట్ నుంచి ఇలాంటి లీకులుండేవి. ఇప్పుడు సెట్ నుంచి స్టిల్స్ లీక్ అయిపోతున్నాయి.

ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్టుపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. జాన్వి కపూర్ ఈ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమౌతోంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.