వెండితెరపైకి మరో ఇంట్రెస్టింగ్ కాంబినేషన్

కొన్ని కాంబినేషన్లు ఇలా వినగానే అలా ఆసక్తి రేకెత్తిస్తాయి. ఇది అలాంటి కాంబినేషనే. మాధవన్, నయనతార హీరోహీరోయిన్లుగా సినిమా తెరకెక్కుతోంది. క్లీన్ యాక్టింగ్ కు పెట్టింది పేరైన వీళ్లిద్దరూ కలిసి నటిస్తే చూడాలని చాలామందికి…

కొన్ని కాంబినేషన్లు ఇలా వినగానే అలా ఆసక్తి రేకెత్తిస్తాయి. ఇది అలాంటి కాంబినేషనే. మాధవన్, నయనతార హీరోహీరోయిన్లుగా సినిమా తెరకెక్కుతోంది. క్లీన్ యాక్టింగ్ కు పెట్టింది పేరైన వీళ్లిద్దరూ కలిసి నటిస్తే చూడాలని చాలామందికి ఉంది. ఇన్నాళ్లకు ఈ కాంబినేషన్ సెట్ అయింది.

కంటెంట్ ఉన్న సినిమాలు నిర్మించే వై-నాట్ స్టుడియోస్ సంస్థ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తోంది. ఇన్నాళ్లూ ఈ బ్యానర్ పై సినిమాలు నిర్మించిన శశికాంత్, ఇప్పుడు తన బ్యానర్ పై స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. దర్శకుడిగా ఇతడికిదే తొలి సినిమా.

తాజాగా ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ చేశారు. మూవీకి 'టెస్ట్' అనే పేరు పెట్టారు. ఇదొక స్పోర్ట్స్ డ్రామా. ఈరోజు రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ లో క్రికెట్ స్టేడియం, క్రికెట్ బాల్స్ ను చూపించారు.

ఈ సినిమాకు సంబంధించి మరో పెద్ద ఎట్రాక్షన్ ఉంది. ఇందులో ఓ కీలక పాత్రలో సిద్దార్థ్ కనిపించనున్నాడు. అతడికి జోడీగా రాశిఖన్నాను తీసుకున్నారు. పాన్ ఇండియా లెవెల్లో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ వివరాల్ని త్వరలోనే వెల్లడిస్తారు.