మరోసారి ‘టెన్త్ క్లాస్’

టెన్త్ క్లాస్, ఇంటర్ టైమ్ ప్రేమల నేపథ్యంలో బోలెడు తెలుగు సినిమాలు తెరపైకి వచ్చాయి. టెన్త్ క్లాస్ జ్ఞాపకాలు, వాటి రీ యూనియన్ బ్యాక్ డ్రాప్ ను యాడ్ చేస్తూ మరోసారి అలాంటి సినిమా…

టెన్త్ క్లాస్, ఇంటర్ టైమ్ ప్రేమల నేపథ్యంలో బోలెడు తెలుగు సినిమాలు తెరపైకి వచ్చాయి. టెన్త్ క్లాస్ జ్ఞాపకాలు, వాటి రీ యూనియన్ బ్యాక్ డ్రాప్ ను యాడ్ చేస్తూ మరోసారి అలాంటి సినిమా అందిస్తున్నారు సినిమాటోగ్రాఫర్ అంజి. 

ఆయన తొలిసారి డైరక్టర్ గా మారి టేకప్ చేసిన ఈ సినిమాలో శ్రీరామ్, అవిక గౌర్, శ్రీనివాసరెడ్డి, భానుశ్రీ తదితరులు కీలకపాత్రలో పోషించారు.

సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్న ఈ సినిమా ట్రయిలర్ ను విడదుల చేసారు. విరసీవిరయని వయస్సు నేపథ్యంలో కలిగే ప్రేమలు, కుర్రకారు భావనలు వాటి పర్యవసానాలు చూపిస్తూనే, రీయూనియన్ కాన్సెప్ట్ ను జోడించినట్లు కనిపిస్తోంది. దానికి మళ్లీ ఓ ఎమోషనల్ లవ్ స్టోరీని కలిపారు.

మొత్తం మీద ఓ ప్యాక్ట్ యూత్ ఫుల్ సినిమా అందించే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది.