సాక్ష్యం సినిమాతో మాంచి హిట్ కొట్టాల్సింది దర్శకుడు శ్రీవాస్. కానీ తృటిలో తప్పిపోయి, అదృష్టం మొహం చాటేసింది. ఇప్పుడు మళ్లీ మరో ప్రయత్నం చేయబోతున్నారు. నిర్మాత డివివి దానయ్య కుమారుడు డివివి కళ్యాణ్ ను హీరోగా పరిచయం చేయబోయే సినిమాకు దర్శకుడు శ్రీవాస్ ఎంపికయ్యాడు. వాస్తవానికి దర్శకుడు మారుతికి అడ్వాన్స్ ఇచ్చాడు దానయ్య.
అయితే శ్రీవాస్ తెచ్చిన కథ చాలా బాగుండడంతో కొడుకు ను శ్రీవాస్ ఛేతిలో పెట్టాడు. మారుతి తో మరో సినిమా చేసే ఆలోచనలో వున్నారు. అయితే ప్రతి రోజూ పండగే సక్సెస్ ను వేరే వాళ్లకి ఇవ్వడం ఇష్టం లేని నిర్మాతలు బన్నీవాస్-యువి వంశీ మళ్లీ తరువాత సినిమాకు కూడా తమ బ్యానర్ లోనే ఫిక్స్ చేసుకున్నారు.
మారుతి డైరక్షన్ లో మళ్లీ జిఎ2 బ్యానర్ మీదే సినిమా వుంటుంది. ఆ తరువాత దిల్ రాజు, నిరంజన్ రెడ్డి, ఘట్టమనేని మంజుల, ఆపై దానయ్య సినిమాలు మారుతి చేయాల్సి వుంటుంది.